టాలీవుడ్ లో అల్లు అర్జున్సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా ఆర్య అని చెప్పవచ్చు.  ఆర్య మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత దాని సీక్వెల్ గా మరో మూవీ తెరకెక్కించారు.  అదే ఆర్యఅల్లు అర్జున్ , కాజల్నవదీప్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ పెద్దగా అలరించలేకపోయింది.  కాకపోతే ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సుక్కు-బన్నీ కాంబినేషన్లో మరో మూవీ వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ వారి కాంబినేషన్లో మళ్లీ ఏ మూవీ రాలేదు వాస్తవానికి సుకుమార్ చాలా కథలు వినిపించండి కానీ నీకు మాత్రం ఏమాత్రం నచ్చలేదట.

 

పట్టువదలని విక్రమార్కుడిలా కొత్త కొత్త కథలతో బన్ని ని కలవడం మొత్తానికి ఓ మూవీ ఓకే చేయించడం చేశాడట సుకుమార్.  ఈ ఏడాది అలా వైకుంఠపురం లో సూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురం బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుండడం తో బన్నీసినిమా కోసం బన్నీ గెడ్డం పెంచుతున్నాడు. అదే సమయంలో చిత్తూరు స్లాంట్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

 

ఇక ఈ సినిమా ను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా దసరా కు అనుకున్నప్పటికీ ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ వస్తుండడం తో సెప్టెంబర్ లోనే విడుదల చేయాలనీ భావిస్తున్నారు. ఈ మూవీ లో బన్నీ కి జోడిగా రష్మిక నటిస్తుండగా ..దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో మూవీ రూపొంద‌నుంది. అల వైకుంఠపురములో సక్సెసో జోష్ సుక్కు సినిమాతో అందుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: