విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. ఎఫ్ ౨ గత ఏడాది ఆరంభంలో ఎఫ్ ౨ తో మంచి విజయం అందుకున్న వెంకటేష్ అదే ఏడాది చివర్లో వెంకీ మామాతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు బంపర్ హిట్లు సాధించిన వెంకీ వరుసగా సినిమాల్ని లైన్లో పెడుతున్నాడు. వెంకీ మామ సినిమాలో రీల్ లైఫ్ మామా అల్లుళ్ళుగా చేసిన నాగచైతన్య, వెంకీల నటన తెర మీద అద్భుతంగా అనిపించింది.

 

 

అయితే ప్రస్తుతం వెంకటేష్ తమిల చిత్రమైన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప గా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదల అయింది. నారప్ప ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. నారప్పగా వెంకీ చాలా చక్కగా ఒదిగిపోయాడని అంటున్నారు. అప్పటి వరకూ రీమేక్ ఎందుకు చేయడం అన్నవాళ్ళు సైతం ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకీ ని చూశాక ఈ చిత్రంపై అంచనాలు పెట్టేసుకున్నారు.

 

 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే వెంకీ మరో సినిమాని కూడా లైన్లో పెట్టాడు.  ప్రస్తుతం ‘నారప్ప’ సినిమా చేస్తున్న ఈ సీనియర్ హీరో దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తాడట. నారప్ప సినిమా తరువాత తరుణ్ భాస్కర్ సినిమా సమ్మర్ నుండి మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా హార్స్ రెసింగ్ నెపథ్యంలో సాగుతుందిని వినికిడి.

 

 

అందువల్ల ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు సినిమాను మలక్ పేట్ రేస్ క్లబ్బులో చిత్రీకరిస్తారట. ఈ సినిమాపై ఇలాంటి ప్రచారం ఇంతకుముందే వచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో ఆ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహం ఏర్పడింది. అయితే ఇప్పుడు సమ్మర్ నుండి మొదలవుతుందని తెలియగానే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: