డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా నటించిన ఇడియట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మాస్ మహారాజ పై దర్శక నిర్మాతలు భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది కలెక్షన్స్ కూడా బాగా రాబట్టాయి. ఆ తర్వాత దుబాయ్ శీను,  వెంకీ మరికొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. బలుపు పవర్ సినిమా తర్వాత రవితేజకు వరుసగా ఫ్లాపులు మొదలయ్యాయి. బెంగాల్ టైగర్ కిక్ 2 భారీ డిజాస్టర్ అయ్యాయి.  అయితే ఫ్లాపుల తర్వాత రవితేజ రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు.  

 

అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాజా ది గ్రేట్ సినిమా తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ మూవీ బాక్సాఫీస్ హిట్ సాధించింది కూడా బాగా చేసింది.  తర్వాత రవితేజ కు మళ్లీ బ్యాడ్ టైం మొదలయింది.  వరుసగా నాలుగు మూవీలు భారీ ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు రవితేజ సినిమా తీయాలంటే కాస్తా వెనక్కి వెళ్తున్నట్టు టాలీవుడ్ సమాచారం. గతంలో రవితేజతో కమిట్  అయిన కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డ టు టాలీవుడ్ లో గుసగుసలు.  ఏదేమైనా ఎలాంటి హీరో అయినా సక్సెస్ ఉంటేనే కెరీర్ బాగా సాగుతుంది అని అర్థమవుతుంది. అంత‌కు ముందు ఒక‌రిద్ద‌రు నిర్మాత‌లు ఈ సినిమా ఆడుతుందేమో ర‌వితేజ‌తో సినిమా తీయాల‌ని అనుకున్నారు.. ఇప్పుడు వాళ్లంతా నాలుగో ప్లాప్ రావ‌డంతో ర‌వితేజ అంటే మాకు తెలియ‌ద‌న్న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. 

 

 సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఇదే మ్యాట‌ర్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ అవుతోంద‌న్న అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.  ఏది ఏమైనా ఇప్పుడు డిస్కోరాజా మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రవితేజ కెరీర్ మళ్లీ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తుంది. కాకపోతే గోపిచంద్ మలినేని తో  క్రాక్ మూవీ తెరకెక్కుతుంది.  ఈ మూవీ గనక మంచి హిట్ టాక్ వస్తే రవితేజ మళ్లీ లైన్లో పడొచ్చు అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: