ఫెయిల్యూర్ సినిమా నిర్మాతలు కూడ తమ మూవీ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేయడానికి మీడియా మీట్స్ పెట్టడం ఒక కల్చర్ గా మారిపోయింది. అలాంటి సందర్భమే ‘డిస్కోరాజా’ నిర్మాతలు కూడ పాటించి ఈ మూవీ సక్సస్ అయింది అంటూ ప్రచారం చేయడానికి ఒక సక్సస్ మీట్ ను మీడియాతో నిర్వహించారు. 

అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన రవితేజా తీవ్ర అసహనంతో చాల అసౌకర్యంగా కనిపించడమే కాకుండా ఈ మీడియా మీట్ కు వచ్చిన మీడియా వర్గాలను కనీసం మర్యాదకు కూడ పలకరించక పోవడం మీడియా వర్గాలకు విపరీతమైన కోపాన్ని తెప్పించినట్లు టాక్. అయితే ఈ మీడియా మీట్ లో కేక్ కట్ చేసే కార్యక్రమానికి కూడ దూరంగా ఉండటమే కాకుండా కనీసం మైక్ పుచ్చుకుని మాట్లాడడానికి కూడ రవితేజా ఇష్టపడక పోవడం చాలామందికి షాక్ ఇచ్చింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘డిస్కో రాజా’ మూవీకి మీడియా ఇచ్చిన నెగిటివ్ రేటింగ్స్ ను చూసి రవితేజా షాక్ అవ్వడమే కాకుండా మీడియా పై విపరీతమైన కోపాన్ని కూడ పెంచుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మీడియా నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చినా ‘వెంకీ మామ’ లాంటి సినిమాలు మంచి కలక్షన్స్ ను తెచ్చుకున్నాయి. 

మాస్ మహారాజా సినిమాకు కనీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాకపోవడంతో మాస్ మహారాజా కెరియర్ ఇక ముగిసిపోయినట్లేనా అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలను లెక్క చేయకుండా రవితేజా అతడి పుట్టినరోజునాడు మరొక సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వంలో లైన్ క్లియర్ చేయడమే కాకుండా ఆ సినిమాను ప్రారంభిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో మాస్ మహారాజ గోడకుకొట్టిన బంతిలా మళ్ళీ రివర్స్ స్పీడ్ లో వస్తున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి రవితేజా మార్కెట్ పూర్తిగా పడిపోయినా అతడితో సినిమాలు చేయడానికి ఇప్పటికీ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు అంటే మాస్ మహారాజ స్థాయి ఏమిటో తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: