స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో విడుదలై రెండు వారాలు దాటినా ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను  కొనసాగిస్తూ కాసుల వర్షం కురిపిస్తుంది. దాంతో ఈ చిత్రం 14రోజుల్లో  ప్రపంచ వ్యాప్తంగా  140.12కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్  రికార్డు ను సృష్టించింది. అలాగే  తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు వారాల్లో 110.67 కోట్ల షేర్ తో  టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమా  గా ఘనత సాధించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా  మరో 6-7కోట్ల వసూళ్లను రాబట్టుకోనుంది.  త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని  అల్లు అరవింద్ , రాధాకృష్ణ నిర్మించారు. 
 
 
ప్రపంచ వ్యాప్తంగా  అల.. కలెక్షన్లు ఇలా వున్నాయి : 
 
నైజాం - 36.8 కోట్లు  
సీడెడ్ - 17 కోట్లు 
ఉత్తరాంద్ర - 17.95 కోట్లు 
గుంటూరు - 9.7 కోట్లు 
తూర్పు గోదావరి - 9.34 కోట్లు 
పశ్చిమ గోదావరి - 7.72 కోట్లు 
కృష్ణా - 8.4కోట్లు 
నెల్లూరు - 3.76కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14రోజులకు గాను షేర్ = 110.67 కోట్లు
 
రెస్ట్ అఫ్ ఇండియా - 11.2  కోట్లు 
ఓవర్సీస్ - 18.25 కోట్లు 
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  14రోజులకు గాను షేర్ = 140.12 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: