ప్రతి సంవత్సరం జనవరి 26 న రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జరుపుకుంటారు, ఈ రోజును దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. రిపబ్లిక్ డే అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటారు అన్న సందేహాలు అంద‌రిలో ఉంటాయి.  1947లో బ్రిటీష‌ర్ల పాల‌న నుంచి భార‌త‌దేశానికి విముక్తి క‌లిగింది. ఆనాటి నుంచి కూడా భారత దేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. ఆ రోజునే రిపబ్లిక్ డే గా పాటిస్తున్నాం. అయితే దేశభక్తిని చాటి చెప్పే  సినిమాలు మ‌న తెలుగులో ఎన్నోవ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా వాటిని ఒక‌సారి గుర్తు చేసుకుందాం... 

 

ముందుగా ఎన్టీఆర్ న‌టించిన `స‌ర్దార్ పాపారాయుడు` చిత్రం తీసుకుంటే దీన్ని దాస‌రినారాయ‌ణ‌రావు తెర‌కెక్కించారు. 1980లో వ‌చ్చిన ఈ చిత్రం దేశ‌భ‌క్తిని చాటే చెప్పే గొప్ప చిత్రంగా నిలిచింది.  ఆ త‌ర్వాత `మేజర్ చంద్రకాంత్`  ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన‌ ఈ సినిమాకి కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఆర్మీలో మేజర్ చంద్రకాంత్ పాత్ర‌లో ఎన్టీఆర్ నటన అద్భుతం మ‌నే చెప్పాలి.  ఇందులో పుణ్యభూమి నా దేశం పాట ఇప్పటికి ఫేమసే.  సూప‌ర్‌స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన చిత్రం `అల్లూరి సీతారామరాజు`  ఈ చిత్రం 1974లో విడుదలైంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటనకి అందరూ జై కొట్టారనే చెప్పాలి.  ఇది కృష్ణకి వందో సినిమా కావడం మ‌రో విశేషం.

 

వ‌ర్సెటైల్ యాక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన చిత్రం `భారతీయుడు`. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఓ భారతీయుడు ఎం చేసాడు అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కి అప్ప‌ట్లో విజయాన్ని అందుకుంది.   క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `ఖడ్గం`. ఈ  సినిమా 2002 లో విడుదలైంది. హిందూ ముస్లింల మధ్య స్నేహ బంధాన్ని చాటి చెబుతూ, దేశభక్తి పై మంచి సందేశాన్ని ఇచ్చింది ఈ చిత్రం. ఈ చిత్రం విడుద‌ల పై కూడా అప్ప‌ట్లో కొన్ని వివాదాలు నెల‌కొన్నాయి.  శ్రీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకేక్కిన మ‌రో చిత్రం `మహాత్మ`   ఓ వీధిరౌడి మహాత్మాగాంధీ మార్గంలో ఎలా నడిచాడు అన్న నేపధ్యంలో తెరకెక్కిన చిత్ర‌మిది.   తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన చిత్రం `రాజన్న`. 2011లో విడులైంది. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఘన విజయాన్ని అందుకుంది. 

 

ఇటీవ‌లె సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో` సైరా నరసింహ రెడ్డి` :ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా పిలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇవే కాకుండా వేదం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరం పులి, సుభాష్ చంద్రబోస్, పరమవీర చక్ర, కంచె, టెంపర్  ఇలా చెప్పుకుంటూ పోతే  దేశ‌భ‌క్తికి సంబంధించిన చిత్రాలు మ‌న ద‌ర్శ‌కులు ఎన్నో తెర‌కెక్కించార‌నే చెప్పాలి. అలాగే వాటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఈ సినిమాల నుంచి  మ‌న పిల్ల‌ల‌కు కొంత చ‌రిత్ర గురించి చెప్ప‌వ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: