భారతదేశంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి, అత్యున్నత సేవలు చేసిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు అందజేస్తుంది. ప్రతిభ, సేవల స్థాయిలను బట్టి అర్హతకు తగ్గ అవార్డులు ఇస్తూంటుంది. అందులో పద్మశ్రీ పురస్కారం కూడా ఒకటి. వివిధ రంగాల్లో అందించే ఈ అవార్డుకు సినీ రంగం నుంచి కూడా అవార్డులు ప్రకటిస్తారు. తెలుగు సినీ రంగం నుంచి ఈమధ్య తమ ప్రతిభ నిరూపించుకున్న వారికి పద్మ అవార్డులు కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి.

 

 

మోహన్ బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు.. వంటి వారికి పద్మ అవార్డులు గతంలోనే వచ్చాయి. సినీ రంగంలో వీరు కనబరచిన ప్రతిభ, సేవా కార్యక్రమాలకు గానూ ఈ అవార్డులు వచ్చాయి. కానీ ఇంతే ప్రతిభను కనబరచిన కొంతమంది సీనియర్లకు పద్మ అవార్డులు దక్కకపోవడం బాధాకరమైన విషయం. కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ.. ఇలా చాలామంది సీనియర్లు ఈ అవార్డుకు ఇంకా నోచుకోకపోవడం కళాకారులుగా వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ తో సరిసమానుడు కైకాల, తెలుగులో వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహంచిన దర్శకుడు కోడి రామకృష్ణ, స్టార్ హీరోగా రాణించిన కృష్ణంరాజు.. ఇలా ఎందరికో ఈ అవార్డు ఇప్పటికీ దక్కలేదు.

 

 

ఏళ్లు గడుస్తున్నా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇటువంటి సీనియర్లకు ఈ అవార్డు ఇప్పటికీ దక్కకపోవడం విచారకరం. ప్రస్తుత రాజకీయ సరళిలో ఈ అంశాన్ని పట్టించుకునే వారు లేకపోయినా.. సినీ పరిశ్రమ నుంచి పెద్దలైనా ఈ అంశంపై స్పందించి గుర్తించాలి. కృష్ణకు దాదాఫాల్కే అవార్డు ఇవ్వాలని చెప్పిన చిరంజీవి వంటి పెద్దలు కైకాల, కృష్ణంరాజు, దివంగత కోడి రామకృష్ణ వంటి వారికి కూడా ఈ అవార్డులివ్వాని స్పందించి పూనుకుంటే వచ్చే ఏడాదైనా ఆ కల సాకారమవుతుందనడంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: