సహజంగా పండగ సెలవుల కోసం స్కూలు పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ ఎదురు చూస్తూంటారు. కానీ ఈమధ్య తెలుగు సినిమా వాళ్లు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇటివల సంక్రాంతి కోసం మహేశ్, బన్నీ పడ్డ పోటీ అందరికీ తెలిసిందే. అదే విధంగా ఈఏడాది దసరాకి రెండు భారీ సినిమాలు పోటీ పడనున్నాయని ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్ ఒకటైతే.. రెండోది ప్రభాస్ కొత్త సినిమా జాన్.

 

 

ఆర్ఆర్ఆర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. రాజమౌళి క్రేజ్, చరణ్, ఎన్టీఆర్ స్టార్ డమ్ తో ఈ సినిమా అంచనాలను పెంచేసింది. విడుదలెప్పుడా అనే ఆసక్తి పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తుంటే.. అభిమానులు మాత్రం ఊగిపోతున్నారు. ఈ సినిమాను ఈఏడాది జూలై 30న విడుదల చేస్తామని యూనిట్ గత ఏడాదే ప్రకటించారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేస్తారని అంటున్నారు. మరో వైపు బాహుబలితో నేషనల్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ లేటెస్ట్ మూవీ జాన్ తెరకెక్కుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

 

 

బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ సాధించడమే ఇందుకు ఉదాహరణ. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్రభాస్ తోపాటు యూనిట్ భావిస్తోందని సమాచారం. రెండు సినిమాలకు 15రోజులు గ్యాప్ వస్తున్నా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ హవా ఓ రేంజ్ లో ఉంటుందనేది అంచనా. మరి రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అయిన రాజమౌళి-ప్రభాస్ రీల్ లైఫ్ లో క్లాష్ అవుతారా లేదా అనేది అఫిషియల్ గా తేలాల్సిన అంశం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: