గత ఏడాది వరుసగా డిజాస్టర్స్ పొందిన రవితేజ ఈ ఏడాది మొదట్లోనే డీలా పడిపోయాడు. ఇడియట్ సినిమా తో మంచి హిట్ అందుకున్న రవితేజ తర్వాత మాస్ మహారాజా గా ప్రేక్షకుల ముందు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు రవితేజ కెరీర్ ని పూర్తిగా మార్చింది. ఆ తర్వాత డాన్ శీను వెంకీ పవర్ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అనుకున్నాడు రవి తేజ. ఆ తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది.. కిక్ 2, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలతో మళ్లీ డిజాస్టర్స్ పొందాడు. ఎలా లేదనుకొని తన ఫిట్నెస్పై దృష్టి పెట్టి రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న రవితేజ. మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడి రవితేజ ను కలవడం ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ

 

సినిమాలో రవితేజ పూర్తి గా  ఆందుడిగా నటించాడు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే రవితేజకు మళ్లీ మంచిరోజులు వస్తాయని భావించారు అందరు. ఆ తర్వాత రవితేజ నటించిన మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్స్ గా ఉన్నాయి.  ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన డిస్కో రాజా మూవీ కూడా భారీ డిజాస్టర్  అయ్యింది. అయితే తను మూవీ కి సరైన రివ్యూస్ ఇవ్వలేదని రీసెంట్ గా రవితేజ మీడియాపై కస్సుబుస్సు అంటున్నట్టు సమాచారం.

 

తాను నటిస్తున్న క్రాక్ మూవీపై ఏవైనా  నెగిటివ్ సృష్టిస్తారని కూడా భయపడుతున్నారు.  సినిమా పూర్తిగా వచ్చిన తర్వాతనే ఇలాంటి వార్తలు రాస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వర్ష డిజాస్టర్ చూపించిన రవితేజ టెన్షన్లో పడిపోవడం  ఫ్యాన్స్ కూడా నిరాశ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: