యువ‌ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అశ్వద్ధామ. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ శౌర్య మాట్లాడుతూ.... ఖమ్మంలో జరుగుతున్న మా అశ్వద్ధామ ఆడియో ఫంక్షన్ ను సక్సెస్ చెయ్యడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో అశ్వద్ధామ సినిమాలో హీరో అదే చేస్తాడు.

 

మెహరిన్ వాళ్ళ గ్రాండ్ ఫాథర్ కు హెల్త్ బాగోకపోయిన మన ఫంక్షన్ కు రావడం గ్రేట్, తనకు సినిమాపై ఫ్యాషన్ ఏంటో అర్థం అవుతుంది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందునే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇది ఒక నిజాయితీ గల కథ, నా ఫ్రెండ్ చెల్లికి జరిగిన ఒక సంఘటనను ఆధారంగానే ఈ కథను రాసుకున్నాను. డైరెక్టర్ రమణ తేజ సినిమాను బాగా తీసాడు, మనోజ్ రెడ్డి కెమెరా వర్క్, గ్యారీ ఎడిటింగ్ ఇలా అందరి వర్క్ సినిమాకు హెల్ప్ అయ్యింది. నాకు కథ రాయాలని ఉందని అమ్మ, నాన్నాతో చెప్పినప్పుడు వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నాను, అశ్వద్ధామ అందరికి నచ్చే సినిమా అవుతుంది, సమాజంలో జరిగిన కథను నేను రాయడానికి ప్రేరేపించిన కొన్ని అంశాలు సినిమాలో చూస్తారు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ మూవీలో ఉంటాయి. నన్ను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న అందరికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాను అన్నారు.

 

ఇక ఈ చిత్రం క‌థ మొత్తం హీరో నాగ‌శౌర్య రాసుకున్న విష‌యం తెలిసిందే. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌తేజ. ఆయ‌న నాగ‌శౌర్య‌కి ఫ్రెండ్‌. సొంత బ్యాన‌ర్లో వ‌స్తున్న ఈ చిత్రం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. నాగ‌శౌర్య గ‌త చిత్రం ఫ్లాప్ బాట ప‌ట్టింది కాబ‌ట్టి ఈ చిత్ర‌మైన స‌క్సెస్ అవుతుందా అని ఆయ‌న ఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నారు. ఇక‌పోతే ఇటీవ‌లె ఆయ‌న ఓ బేబి చిత్రంలో స‌మంత‌కు పెయిర్‌గా క‌నిపించి అంద‌రినీ అల‌రించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: