సామాన్యంగా ఒక స్దాయికి ఎదగాలంటే ఎంతగానో శ్రమించాలి. శ్రమతో పాటుగా క్రమ శిక్షణ, నిజాయితీ కూడా ఉండాలి. కొంతమందికి జీవితంలో ఎదగడానికి ఇవి ఖచ్చితంగా పాటించి ఎదుగుతారు. అంతవరకు ఒకే కానీ ఎదిగినాక వచ్చిన సక్సెస్‌ను కాపాడుకోవడంలో విఫలమవుతారు. అంతవరకు సంపాధించుకున్న పేరు ప్రతిష్టలను దిగజార్చుకుంటారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు నోటి దురుసువల్ల వదిలిన మాటలు ఎన్ని అనర్ధాలకు దారి తీస్తాయో ఈ నటున్ని చూసి నేర్చుకోవచ్చు.

 

 

ఇక్కడ జీవితంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి ఎంత కష్టపడతాడో, దాని చిరకాలం నిలుపుకోవడానికి కూడా అంతే శ్రమించవలసి ఉంటుంది. ఎక్క్కడ తన బ్యాలన్స్ కోల్పోయినా అతని మీద అప్పటి వరకు ఉన్న అంచనాలు, విలువలు సన్నగిల్లితే, తిరిగి అవి పొందడం చాలా కష్టం. ఇప్పుడు కమెడియన్ పృథ్వీ ని చూస్తే అర్ధం అవుతుంది. ఇకపోతే సినిమాల్లో థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ కేరిర్ ఓ ద‌శ‌లో పీక్స్‌కు చేరుకుని. బ్ర‌హ్మానందం త‌ర్వాత స్థానం అందుకుంటాడ‌ని భావిస్తున్న క్ర‌మంలో ఆయ‌న రాజ‌కీయాలలో అడుగుపెట్టాడు. వైసిపి త‌ర‌పున జ‌గ‌న్‌తో క‌ల‌సి పాద‌యాత్ర చేయ‌ట‌మే కాకుండా ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చాక ఎస్‌వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వి అందుకున్నారు.

 

 

అయితే పృథ్వీ చేసిన తప్పు ఏంటంటే అవ‌కాశం దొరికి న‌ప్పుడ‌ల్లా ఎలాంటి ఆలోచించుకోకుండా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై, ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌టం ఆరంభించాడు. విమ‌ర్శ‌లు చేసే ముందు ఎవ‌రేం చెప్పినా నెవ్వ‌ర్‌. త‌నేం అనుకుంటే అదే చెపుతానంటూ హూంక‌రించేవాడు. ఇక పృథ్వీ కి మెగా కాంపౌండ్ నుంచి ఒక‌ప్పుడు ప్ర‌త్యేకంగా పిలిచి మ‌రీ పాత్ర‌లిచ్చేవారు తీరా ప్ర‌స్తుత ప‌రిస్థితిలో గ‌తంలో ఆయ‌న నోటి దురుసుతో విమ‌ర్శ‌లు గుప్పించిన కార‌ణంగా సినిమా కెరీర్‌పై ఎఫెక్ట్ ప‌డి మెగా హీరోలే కాదు వారితో సంబంధాలు నెరిపే నిర్మాత‌లు కూడా పృధ్వీని నటుడిగా తీసుకునేందుకు స‌సేమిరా అంటున్నార‌ట‌. ఇదే కాకుండా నంద‌మూరి ఫ్యామిలీ సైతం పృధ్వీని ప‌క్క‌కు పెట్టాల‌ని నిర్ణ‌యించింద‌ని వార్త‌లొస్తున్నాయి.

 

 

ఇకపోతే అల వైకుంఠ‌పుర‌ములో జ‌య‌రాం బామ‌ర్ది పాత్ర‌కు ముందుగా పృథ్వీనే తీసుకున్నారు. తీరా ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌లు రావ‌టం పృథ్వీ త‌న మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రెచ్చిపోయిన చేసిన వ్యాఖ్య‌లతో ఇతన్ని ఆ పాత్ర నుండి తప్పించి ఆ ప్లేస్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను తీసుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.. ఇదే కాకుండా ఎస్‌వీబీసీ ఛైర్మ‌న్‌గా ఉన్న పృధ్వీ ఓ మ‌హిళ మాట్లాడిన అస‌భ్య‌క‌ర మాట‌లు బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఆత‌ని రాజ‌కీయ ప‌రిస్థితి తారుమారు అయ్యింది. పదవి ఊడింది. ప్రస్తుతం సినిమాల‌లోనూ అవ‌కాశాలు రాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి పరిస్దితుల్లో రాజ‌కీయంగా లైఫ్ క్లోజైనా మ‌ళ్లీ సినిమాల్లో నటించే దారులు దాదాపుగా మూసుకుపోవడంతో ఇప్పుడు ఇతని పరిస్దితి రెండిటికీ చెడ్డ రేవ‌డి లా మారింది. ప్రస్తుతం థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వీ దిక్కుతోచని పరిస్దితుల్లో, ఏం చేయాలో అర్ధం కాకుండా దీనంగా మారాదని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: