మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` అల్లుఅర్జున్, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌లైన విష‌యం తెలిసిందే. రిలీజైన‌ప్ప‌టి నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళుతుంది. ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది ఈ చిత్రం. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోంది. త్రివిక్ర‌మ్‌, అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మూడ‌వ చిత్రం ఇది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో జులాయి,  ‘s/o సత్యమూర్తి’ చిత్రాలు వ‌చ్చి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి త‌మ‌న్ ఆడియో మంచి ప్ల‌స్ అయింది. 

 


ఇక‌పోతే ఇది అల్లు అర్జున్ కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా అని కూడా చెప్పవ‌చ్చు. మొదటి 7 రోజుల్లో 84.86 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేయ‌గా... ఈ సినిమా 13రోజుల్లో 109.25 కోట్లతో అల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ గా నిలిచింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్-3 షేర్స్ అంటే బాహుబలి 2(198.7 కోట్లు), అల వైకుంఠపురములో (112.69 కోట్లు) మరియు బాహుబలి1 (110.1 కోట్లు).

 

అలాగే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే చిరంజీవి న‌టించిన సైరా నరసింహా రెడ్డి అల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసి ఆలా వైకుంఠపురములో టాప్ 3 లో నిలిచింద‌నే చెప్పాలి.  వరల్డ్ వైడ్ టాప్ 3 – బాహుబలి 2(198.7 కోట్లు), బాహుబలి1 (183.8 కోట్లు) మరియు అల వైకుంఠపురములో (142.51 కోట్లు).

 

‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ 2 వీక్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 36.64 కోట్లు
సీడెడ్ – 17.10 కోట్లు
గుంటూరు – 10.11 కోట్లు
ఉత్తరాంధ్ర – 17.21 కోట్లు
తూర్పు గోదావరి – 10.03 కోట్లు
పశ్చిమ గోదావరి – 7.80 కోట్లు
కృష్ణా – 9.72 కోట్లు
నెల్లూరు – 4.08 కోట్లు

14 డేస్ మొత్తం షేర్ – 112.69 కోట్లు

కర్ణాటక – 8.8 కోట్లు
కేరళ – 1.22 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 2.12 కోట్లు
ఓవర్సీస్ – 17.68 కోట్లు

వరల్డ్ వైడ్ 14 డేస్ షేర్ – 142.51 కోట్లు

 

మ‌రి ఇవ‌న్నీ కూడా క‌రెక్టేనా ఈ క‌లెక్ష‌న్ల‌లో ఎటువంటి ఫేక్ లేదు క‌దా అని కొంత మంది అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తుంటే. మ‌రి కొంత మంది మాత్రం ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అని అంటున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ సారి మాత్రం స‌రిలేరు, అల మ‌ధ్య చాలా గ‌ట్టి పోటీనే నెల‌కొనింది అని చెప్ప‌వ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: