బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. అజిత్ నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో కూడా మంచి సక్సస్ ని సాధించింది. దాంతో ఈ సినిమాని తెలుగులో కూడా తీయాలని డిసైడయ్యారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమా మీద క్రేజ్ నొలకొంది. అయితే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాకు పవన్ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా టాక్ ఒకటి వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా అయినప్పటికి, దిల్ రాజు నిర్మాత అయినా గాని ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తప్ప నాన్ థియేట్రికల్ రైట్స్ ను కొనడానికి బయ్యర్లుమ ఉందుకు రావడం లేదు. 

 

ఇప్పటికే హిందీ, తమిళంలో ఈ సినిమా వచ్చి మంచి సక్సస్ ను అందుకోవడంతో ఆన్ లైన్ అదే విధంగా శాటిలైట్ ఛానెల్స్ లో ప్రసారం అవ్వడంతో ప్రేక్షకులు బుల్లి తెరపై చూడ్డానికి ఎలా ఆసక్తి చూపిస్తారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోవడం అనుమానంగానే ఉందని తాజాగా ఒక మాట వినిపిస్తుంది. అందుకే పవన్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గినట్లుగా చెప్పుకుంటున్నారు.

 

రీమేక్ కు లాయర్ సాబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్ర బృంద్మ్. త్వరలోనే టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకున్నా కూడా 25 కోట్ల వరకు రావడం కష్టంగా ఉందట. అందుకే నిర్మాతలకు భారం కావద్దనే ఉద్దేశ్యంతో పవన్ తన రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచించినట్లుగా తెలుస్తోంది. ముందు అనుకున్నట్టు గా కాకుండా తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: