టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.  రీ ఎంట్రీ అదిరిపోయింది.. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ మంచి కలెక్షన్లు సాధించింది.  ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం లో నటించారు.  రైతుల కోసం పోరాట చేసే ఓ యువకుడి పాత్రలో చిరంజీవి నటనకు నిజంగా అందరూ ఫిదా అయ్యారు.  అయితే ఈ మూవీ తర్వాత మరో భారీ బడ్జెట్ తో ‘సైరా’ తెరకెకర్కించారు.  కానీ ఈ మూవీ అనుకున్న అంచనాలు అందుకో లేక పోయింది.  రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసినా ఈ మూవీ ప్రజాకర్షణ సాధించుకోలేక పోయింది.  మొత్తానికి నాలుగు భాషల్లో ఈ మూవీ ఏ భాషలోనూ సక్సెస్ సాధించలేక పోయింది. 

 

సైరా నరసింహారెడ్డి తర్వాత ఆయన మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే స్టార్ ప్రొడ్యూసర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ దేవాలయాల మాఫియాకు సంబంధించిన ఉండబోతున్నట్లు చిరంజీవి మరోసారి ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాలనే ఎందుకు ఎంచుకున్నారు.. త్రివిక్రమ్, రాజమౌళి, మరికొంత మంది అగ్ర దర్శకులు లైన్లో ఉన్నా.. కొరటాలకే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే.. ఇప్పటి వరకు కొరటాల ‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్,భరత్ అనే నేను’ లాంటి సినిమాలతో మంచి కమర్షియల్ మాత్రమే కాదు.. మెసేజ్ కూడా అందించారు. 

 

అందుకే ఆయన సినిమాలంటే కేవలం కమర్షయిల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు.. మంచి మెసేజ్ ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఎలాంటి హీరోకి ఎలాంటి సినిమా ఉండాలో కొరటాలకు బాగా అవగాహన ఉందని అంటారు.  ఈ నేపథ్యంలో మంచి కథ మెగాస్టార్ కి వినిపించడం.. చిరు ఓకే చేసేయడం సెట్స్ పైకి వెళ్లడం జరిగిందని అంటారు.  కొరటాలపై మంచి నమ్మకం ఉంచే చిరు రంగంలోకి దిగినట్టు టాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: