ఇట్లు శావణి సుబ్రమణ్య,ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ...ఇలా ఒకప్పుడు రవితేజ హీరోగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేవాడు. వరుసగా బ్లాక్ బస్టర్సే. ఒక్కసారిగా రవితేజకి విపరీతమైన స్టార్ డం. అంతేకాదు కోట్లలో రెమ్యూనరేషన్. ఆ ఫాం ఆపడం ఎవరి వల్లాకాలేదు. అయితే గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్ లు రావడంతో సినిమాల స్పీడ్ తగ్గించాడు. ఆచి తూచి సినిమాలను చేస్తున్నాడు. దాంతో ఆయన చిత్రాల మద్య చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది. రాజాది గ్రేట్ తో ఒక సూపర్ హిట్ ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని ..సినిమాలు భారీ డిజ్సాస్టర్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా వచ్చిన డిస్కోరాజ కూడా యావరేజ్ అన్న టాక్ వినిపిస్తోంది. అయినా మాస్ రాజా మాంచి ఊపు మీదున్నాడు. ఈ ఏడాది మాస్ రాజా ఫ్యాన్స్ కు ఉబ్బిపోయో న్యూస్ చెపాడు. గతంలో మాదిరిగా ఈ ఏడాది రెండు లేదా మూడు సినిమాలను రవితేజ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తాజా అప్‌డేట్స్ చూస్తే అర్థమవుతోంది.

 

ఇప్పటికే డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ క్రాక్ సినిమాతో మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. రవితేజ పుట్టిన రోజు సందర్బంగా క్రాక్ యూనిట్ సభ్యులు రిలీజ్ డేట్ తో ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ఇన్ని నెలల ముందే సినిమా తేదీని విడుదల చేయడం పట్ల వారికి సినిమాపై ఎంత క్లారిటీ ఉందో తెలియచెప్పారు.

 

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి మధు నిర్మాణంలో ఈ తాజా చిత్రం రూపొందుతుంది. రవితేజ గతంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి పలు సినిమాల్లో ఆకట్టుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఫుల్ లెంగ్త్ పోలీస్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో రవితేజ మరోసారి తన ఫ్యాన్స్ కు పండుగ తీసుకురావడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. క్రాక్ మాత్రమే కాకుండా ఈ ఏడాది మరో సినిమాను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక గతంలో రమేష్ వర్మ-రవితేజ కాంబినేషన్ లో వీర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో తాజా చిత్రాన్ని రవితేజ పుట్టిన రోజు సందర్బంగా అనౌన్స్ చేశారు. ఇక రవితేజ కి వరుసగా ఫ్లాప్స్ వస్తుండటం తో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్ట ఫ్లాప్స్ అంతు చూస్తానంటున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: