ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి సినిమాల్లోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ పింక్ రీమేక్‌తో ఆయ‌న తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ మొద‌లుపెట్టి శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ప‌వ‌న్ రీఎంట్రీ కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం రైట్స్ అన్నీ ఎంతో భారీ రేంజ్లో అమ్ముడ‌వుతాయ‌ని నిర్మాత‌లు ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా సాగుతుంది మొత్తం బిజినెస్‌. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ త‌ప్పించి మొత్తం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అన్నీ కూడా ఖాళీగా ప‌డివున్నాయి. అవి కొన‌డానికి మాత్రం ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. దానికి బ‌య్య‌ర్లు ఎవ్వ‌రూ కుడా ముందుకు రావ‌డం లేద‌ని నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  

 

ఇక దీనికి కార‌ణాలు లేక‌పోలేదు. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వ్వ‌డ‌మేకాక ఆల్రెడీ టీవీల్లో అమెజాన్‌ల‌లో విడుద‌లై  అంద‌రూ చూసేసి ఉంటార‌ని బ‌య్య‌ర్లు ఎవ్వ‌రూ కూడా కొన‌డానికి ముందుకు రావ‌డం లేదు. ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ను కాస్త తగ్గించుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.  పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఇక ఇదిలా ఉంటే గ‌తంలో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడూ కూడా ఏ నిర్మాత‌లైనా క‌ష్టాల్లో ఉంటే గ‌తంలో కూడా ఆయ‌న రెమ్యూన‌రేష‌న్లు తిరిగి ఇచ్చేసిన‌వి చాలానే ఉన్నాయి. 

 

మరి ఇలాంటి హీరోలు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. కొంద‌రు ఇలా ఉంటే మ‌రికొంద‌రు వారు న‌టించే చిత్రాల్లో లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. ఇదివ‌ర‌క‌టి రోజుల్లో ఇలాంటి హీరోలు అంటే సూప‌ర్‌ష్టార్ కృష్ణ‌గారిని అంద‌రూ చెప్పుకుంటారు ఆయ‌న కూడా ఇలాగే నిర్మాత‌లు క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలిస్తే ఆయ‌న సినిమాలు ఫ్రీగా చేసేవారంట‌. తిరిగి మ‌ళ్లీ ఇప్పుడు ఆలాంటి పేరు ప‌వ‌ర్‌ష్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కే వ‌చ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: