‘బాహుబలి’ సినిమా తో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ అదే స్థాయిలో విజయం సాధించాలి అని సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేయడం జరిగింది. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకొని రిలీజ్ అయి మొట్ట మొదటి షోకే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో ప్రభాస్ తో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే 'సాహో' సినిమా సౌత్ లో దారుణంగా ఫ్లాప్ అయినా గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఫ్లాప్ అయినా గాని కలెక్షన్ల విషయంలో ఓ రేంజ్ లో కలెక్షన్లు రావడంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు ప్రభాస్ క్రేజ్ కి ఆశ్చర్యపోయాయి.

 

‘సాహో’ సినిమా ఫ్లాప్ అవటంతో తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని 'జిల్' ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' అనే పాత కాలం నాటి ప్రేమ కథ చిత్రం లో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రభాస్ పక్కన నటిస్తోంది. ఈ సినిమాని ప్రభాస్ పెదనాన్న గోపి కృష్ణ బ్యానర్ లో కృష్ణం రాజు నిర్మిస్తుండగా సంయుక్త నిర్మాతగా యువి క్రియేషన్స్ సంస్థకు చెందిన వాళ్లు కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ కి ఓవర్సీస్లో అంతగా మార్కెట్ లేదని 'సాహో' సినిమా తో పడిపోయిందని ఇటీవల వార్తలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ వస్తున్న క్రమంలో తాజాగా 'జాన్' సినిమా పూర్తవక ముందే ఓవర్సీస్ బిజినెస్ రికార్డు స్థాయిలో చేసినట్లు సమాచారం.

 

విషయంలోకి వెళితే బయట వినబడుతున్న వార్తల ప్రకారం జాన్ సినిమాని ఓ టాప్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ అన్ని భాషలకి సంబందించిన ఓవర్సీస్ రైట్స్ ని 25 కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో ప్రభాస్ అభిమానులు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో అని...ప్రభాస్ మార్కెట్ తో ఎవరిని పోల్చలేమని...దేశంలో ఏ హీరోకి లేని ఇంటర్నేషనల్ మార్కెట్ యంగ్ రెబల్ స్టార్ కి ఉందని...ఇది ప్రభాస్ స్టామినా అంటే అంటూ కామెంట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: