హీరోల కొడుకులు హీరోలు అవ్వాల‌ని కోరుకుంటారు సినీ సెల‌బ్రెటీలు. అయితే ఇటీవ‌లె టాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని కూడా హీరోని చేయాల‌ని ఎప్ప‌టి  నుంచో చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆ శుభ ఘ‌డియ‌లు వ‌స్తాయాని అని ఆ హీరోనే కాదు ఆహీరో ఫ్యాన్స్ కూడా తెగ ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. కానీ ఇదంతా జ‌రిగే ప‌ని కాదంటూ నీరు కార్చేశాడు ఆ స్టార్ హీరో కొడుకు. త‌న‌కు సినిమాల పై పెద్ద‌గా ఆశ‌క్తి  లేదంటూ..కుదిరితే బిజినెస్ చేసుకుంటానంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేశాడు అత‌గాడు. దాంతో ఆహీరోనే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా టెన్ష‌న్‌లో ప‌డ్డారు. 

 

అయితే తాత‌ల కాలం నుంచి అంద‌రూ హీరోలుగా వ‌స్తున్న‌ప్పుడు త‌న వారస‌త్వంలో వ‌చ్చేవారిని కూడా హీరోగా చూడాల‌నుకుంటారు మ‌న తెలుగువారు. కానీ దీనికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు ఆ స్టార్ హీరో కొడుకు. అయితే ఇటీవ‌లె ఆయ‌నవి కొన్ని లుక్స్ కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ పూర్తిగా ఆశ‌ల‌ను వ‌దిలేసుకున్నారు. ఈ అవ‌తారంతో హీరోనా.. అంటూ... కొంద‌రంటే... ఇంకేమి హీరో అంటూ మ‌రికొంద‌రు అంటున్నారు. ఇక ఆ బ‌య‌ట‌ప‌డిన స్టిల్స్ చూస్తే చాలా చండాలంగా ఉన్నాయి. 

 

పైగా అత‌గాడు త‌ల్లిదండ్రులు  చెప్పిన మాట కూడా విన‌డం లేద‌ని కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. పెద్ద పెద్ద ఇళ్ళ‌ల్లో క్ర‌మ‌శిక్ష‌ణ ఉంటుంది అని అనుకుంటాము కానీ దానికి విరుద్ధంగా ఉంటాయి కొన్ని ఇళ్ళ‌ల్లలో క్ర‌మ‌శిక్ష‌ణ‌లు. ఇందుకు సినీ ఇండ‌స్ట్రీలో మ‌రీ కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి. స్టార్ హీరోల పిల్ల‌లు ఎవ్వ‌రూ కూడా స‌రైన క్ర‌మ శిక్ష‌ణ‌తో ఉండ‌రు. ఇందుకు చాలా నిద‌ర్శ‌నాలే ఉన్నాయి. అలాగే గ‌తంలో వారి ఇళ్ళ‌ల్లో జ‌రిగిన చాలా సంఘ‌ట‌న‌లే మ‌నం చూశాం అని చెప్పాలి. అందుకే కొడుకు విష‌యంలో ఆ స్టార్ హీరో చాలా ఆవేద‌న‌తో ఉన్నాడు. ఆ ఫ్యామిలీ కూడా చాలా బాధ‌ప‌డుతోంది. ఇక ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు అత‌ను అధిక వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డి ఏకంగా డ్ర‌గ్గిస్ట్ గా మారిన‌ట్లు స‌మాచారం. గ‌త రెండేళ్ళ నుంచి రీహ్యాబిటేష‌న్ సెంట‌ర్ లో ఉంచి ఈ మ‌ధ్య‌నే ఇంటికి తీసుకువ‌చ్చిన‌ట్లు స‌మాచారం. పెద్ద ఇళ్ళ‌ల్లో పిల్లల‌కు ఇవ‌న్నీ మాములే కానీ మ‌న‌కు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో విన‌డానికి కాస్త కొత్త‌గా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: