తెలుగు చిత్ర పరిశ్రమను నెంబర్ వన్ హీరోగా ముప్పై ఏళ్లకు పైగా ఏలేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తొమ్మిదేళ్లు సినిమాలు చేయక మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టి టాలీవుడ్ కి ఆయనే తిరుగులేని నెంబర్ వన్ హీరోనని చాటిచెప్పాడు. అలాగే.. తమిళ సినీ పరిశ్రమను కూడా ముప్పై ఏళ్లకు పైగా నెంబర్ హీరోగా ఏలేస్తున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఇద్దరూ దాదాపుగా సమకాలీకులే. ఇప్పుడు వీరిద్దరూ రెండు భాషల్లో చేస్తున్న సినిమాలపై ఓ సరదా కామెంట్ వినబడుతోంది.

 

 

మెగాస్టార్ తన 152వ సినిమాను సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతోంది. తమిళ్ లో కూడా రజినీకాంత్సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకడు శివ. తెలుగులో గోపీ చంద్ తో శంఖం, రవితేజతో దరువు సినిమాలు చేశాడు. ప్రస్తుతం రజినీకాంత్ ఇతని దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు. విచిత్రంగా మెగాస్టార్, సూపర్ స్టార్.. ఇద్దరూ చేస్తున్న సినిమాల దర్శకుల పేర్లు శివ కావడమే ఇక్కడ ఫన్నీ మేటర్. సినిమాల పరంగా ఈ ఇద్దరు సూపర్ స్టార్లకు గానీ, ఇద్దరు దర్శకులకు గానీ ఎటువంటి పోలీక, పోటీ లేదు. కానీ.. ఇద్దరు సమకాలీకుల సినిమాలకు ఒకే పేరున్న దర్శకులు ఒకేసారి దర్శకత్వం వహించడం యాధృచ్ఛికం.

 

 

కొరటాల శివకు తెలుగులో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకూ చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లే. శివకు తెలుగులో చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తమిళ్ లో అజిత్ వంటి స్టార్లతో సినిమాలు చేసి హిట్ డైరక్టర్ గా ఉన్నాడు. అయితే.. ఈ రెండు సినిమాలు వచ్చే వేసవికి విడుదలయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇదొక్కటే ఈ రెండు సినిమాలకు పోటీనిచ్చే విషయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: