డబ్బు ఉన్నవారి విలాసాలకు కొదువేముండదని ఈ బాలీవుడ్ హీరోయిన్లు నిరూపిస్తున్నారు. ఎందుకంటే సామాన్యమానవుని ఊహకు అందనంత ఖరీదైన కార్లల్లో వీరు చేసే ఎంజాయ్ స్వర్గానికి దగ్గరగా ఉంటుందట. అంతే కాకుండా కొందరు హీరోయిన్స్ వాడే ప్రతి వస్తువుల గురించి, వాటి రెట్ల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతగానో ప్రయత్నిస్తారు. ఆసక్తి కూడా చూపిస్తారు.

 

 

ఇకపోతే విలాసవంతమైన జీవితాన్ని గడిపే బాలీవుడ్ హీరోయిన్ల దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్ల గురించి తెలుసుకుంటే మామూలుగా షాక్ అవ్వం. ఇలా ప్రస్తుతం బాలీవుడ్ లో ఏడుగురు టాప్ హీరోయిన్లు ఇలాంటి ఖరీదైన కార్లు వాడుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.  ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత, 2002 లో తమిళన్ అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది..

 

 

ఇకపోతే ఈ బాలీవుడ్ బ్యూటీ రోల్స్ రాయిస్ గోస్ట్ కారుని వాడుతోంది. దీని ధర రూ.5.65 కోట్లు. బాలీవుడ్‌ శృంగార నాయికగా చెలామణి అయిన మల్లికా శెరావత్. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం ఈ భామ స్పెషాలిటీ. ఇక గత కొంతకాలంగా తన ఫ్రెంచ్ బిజినెస్ మాన్- బాయ్ ఫ్రెండ్ సిరిల్లే ఆక్సెన్‌ఫాన్స్ తో లవ్ సిటీ(ప్యారిస్)లో ఈ అమ్మడు ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఖరీదైన లాంబోర్గినీ అవెంటడార్ కారుని ఉపయోగిస్తోంది. దీని ధర రూ.5.01కోట్లు.

 

 

దీపికా పదుకొణె 2006లో, ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా అయినా ఐశ్వర్యతో రంగంలోకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఉపయోగించే కారు మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 కారుని ఉపయోగిస్తోంది. ఈ కారు 4.7 లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ట టార్క్ 700 ఎన్ఎమ్ తో కలిపి ఇది గరిష్టంగా 453 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయగలదు. దీని ధర రూ.2.6కోట్లు.  కత్రినాకైఫ్ 2003లో బూం అనే చిత్రంతో పరిచయం అయ్యారు. ఇకపోతే ఈ అమ్మడు రేంజ్‌రోవర్‌ వోగ్‌. వాడుతుంది. దీని  ధర రూ.2.75 కోట్లు..

 

 

'ధడక్‌' చిత్రంతో వెండితేరకు పరిచయం అయిన శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌లో అత్యంత చిన్నవయస్సు ఉన్న హీరోయిన్‌గా చెబుతారు. ఇక ఈ అమ్మడు ఇటీవల బ్యాండ్ న్యూ మెర్సిడెస్-మేబాచ్ ఏస్ 650 కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర 2కోట్లు.. ఇక బాలీవుడ్ బ్యూటీ సైఫ్ అలీ ఖాన్ వైఫ్ కరీనా కపూర్ వాడే కారు కూడా మామూలుది కాదు. ఎందుకంటే ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్‌ కారు పెట్రోల్,డీజిల్ రెండు ఆప్షన్లు కలిగి ఉంది. కేవలం 5.3 సెకన్లలోనే సున్నా నుంచి వంద స్పీడ్ వరకు ప్రయాణించే ఈ కారు బరువు 2.8టన్నులు ఉంటుంది. కాగా దీని ధర రూ.1.56కోట్లు.  

 

 

శృంగార తారగా పేరుగాంచిన సన్నీ లియోన్ కారుకూడా మామూలుది కాదు దీనికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బ్యూటీ లిమిటెడ్ ఎడిషన్  మెర్సిడెస్ బిఎండబ్ల్యూ నెరిస్సిమో కారుని 2017లో ఇంటికి తెచ్చుకుంది. ప్రపంచంలో ఈ మోడల్ కారులు 450మాత్రమే ఉండగా అందులో ఒకటి సన్నీ దగ్గర ఉందట. ఇక దీని ధర రూ.1.36కోట్లు. ఇది కేవలం 4.7సెకన్ల వ్యవధిలోనే 0-10 0కిలోమీటర్ల స్పీడ్ తో,గంటలకు 283 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లుతుందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: