జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్.. తెలియ‌న వారుండ‌రు. ఇక ఈ కామెడీ షోలో సుధీర్ టీం లో సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ముగ్గురూ ఉంటారు. ముగ్గురిదీ ఎవరి స్టైల్ వారిదే. ముగ్గురూ కూడా తమ టైమింగ్ తో.. స్టైల్ తో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ సాధించుకున్నారు. అయితే వీరి ముగ్గురులో సుడిగాలి సుధీర్‌కు మాంచి ఫ్యాన్ ఫాలోంగ్ ఉంద‌న్న‌ది వాస్త‌వం. బుల్లితెరపై మనోడు చేస్తున్న మ్యాజిక్ చూసి ఔరా అంటున్నారు. నిజంగానే వీడి చర్యలు ఊహాతీతం అంటన్నారు ఫ్యాన్స్. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్.

 

బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. ఈ మధ్యే సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో సుధీర్ వెండితెర‌పై చాలా వీక్‌గా ఉన్నాడ‌ని కొంద‌రు భావించాడు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్, ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి  త్రీ మంకీస్ మూవీస్ చేసాడు. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. 

 

తాజాగా ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను బ్రహ్మానందం  విడుదల చేసారు. ఇందులో సుడిగాలి సుధీర్, ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఫ్రెండ్స్. వీళ్లకు పెళ్లి ముందు ఒక అమ్మాయితో ఎజాంయ్ చేయాల‌నుకుంటారు. ఈ సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలతో ఈ ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించింది. ఇక లాస్ట్‌లో  కాస్తంత ఎమోషన్ టచ్ కూడా ఇచ్చారు. ఓవ‌ర్ ఆల్‌గా సినిమాతో ఆడియన్స్ ని నవ్వించడంతో ఏడిపిస్తార‌ని తెలుస్తోంది. అయితే  స్మాల్ స్క్రీన్ పై రాణించినంతగా వెండితెరపై రాణించలేకపోతున్నారు సుధీర్‌. అయితే  గెలుపు.. ఓట‌మి స‌హ‌జం. నిజానికి ఓడిపోతేనే.. గెలుపు విలువ తెలుస్తుంది కూడా. మ‌రి ఇదే ఫార్ములా వ‌ర్కోట్ చేసుకుని ఈ చిత్రంలో స‌క్సెస్ అవుతాడో.. లేదో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: