క్యాలెండర్లు మారినా, కాలచక్రం ఎంత ముందుకు వెళ్లినా కామెడీ ఎప్పటికీ పాతబడదు. ఇలాగే టాలీవుడ్ లో నవ్వులకు మరోరూపంలా నిలిచిన బ్రహ్మానందం ఫాలోయింగ్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చినా.. సిింగిల్ ఫ్రేమ్ లో కనిపించినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. 

 

బ్రహ్మానందం కొన్నాళ్లు తెలుగు తెరపై కనిపించలేదు. వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలతో షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గా అల వైకుంఠపురములో చిన్న పాత్రలో కనిపించాడు బ్రహ్మానందం. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం రాములో రాములా పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే స్క్రీన్ మీద బ్రహ్మీ అలా కనిపించాడో లేదో ప్రేక్షకుల ముఖాల్లోకి నవ్వులు వచ్చేశాయి. 

 

అల వైకుంఠపురములో బ్రహ్మానందం అప్పీరియన్స్ క్రేజీ రెస్పాన్స్ రావడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రచారాలు అన్నీ పక్కకెళ్లిపోతున్నాయి. బ్రహ్మీ హవా తగ్గిందని మాట్లాడినవాళ్లు కూడా ఆలోచిస్తున్నారు. బ్రహ్మానందం ఫాలోయింగ్ తగ్గలేదని.. తామే తప్పుగా అర్థం చేసుకున్నామా అని రీథింకింగ్ చేస్తున్నారు.

 

ఫ్యాన్స్ అయితే బ్రహ్మీకి సరైన క్యారెక్టర్ పడితే.. మళ్లీ విజృంభిస్తాడని చెబుతున్నారు. మరి కామెడీ ఎంటర్ టైనర్స్ తో సూపర్ హిట్ కొడుతోన్న దర్శకులు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం వైపు వెళ్తారా.. ఈయన సీనియారిటీని కరెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారా అనేది తెలియాలి. 

 

బ్రహ్మానందం అంటే కామెడీ.. కామెడీ అంటే బ్రహ్మానందం. ఆయన తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. సిల్వర్ స్క్రీన్ ఆయన కనిపించకపోతే ప్రేక్షకులు ఏదో లోటుగా భావిస్తారు. అందుకే బ్రహ్మానందం కామెడీ అయితే బాగుంటుందని కోరుకుంటారు. అందుకే ఏ సినిమాలో అయినా.. ఆయనను చూపించేస్తున్నారు. సినిమాకు పూర్తి అర్థం తీసుకువస్తున్నారు. అల వైకుంఠపురములో ఆయన కనిపించింది కొద్ది నిమిషాలే అయినా.. ఆయనను చూసిన వెంటనే అందరి ముఖాల్లో నవ్వులు వెలిగిపోయాయి. సెంటిమెంట్ గా బ్రహ్మానందంను చూపిస్తే చాలు సినిమాకు కొంత వరకు మంచి పేరే వస్తుంది. అందుకే బ్రహ్మీని సెంటిమెంట్ గా పెట్టేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: