ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి సీజన్ కావడం, అలానే సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బన్నీ అదిరిపోయే యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ వంటివి సినిమాకు మరింత బాగా కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం కూడా మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమా లోని సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనర్కర్లేదు. ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాముల సాంగ్స్ కు అయితే శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సాంగ్స్ కు థమన్ అందించిన మ్యూజిక్ తో పాటు పాటల రచయితలకు కూడా మంచి పేరు లభించింది. 

 

ఇకపోతే నేడు దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్ తో కలిసి ఈ సినిమా పాటల రచయితలతో ఒక ప్రత్యేక ఇంటర్వూని నిర్వహించారు. అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన బుట్ట బొమ్మ సాంగ్ గురించి థమన్, త్రివిక్రమ్ మాట్లాడుతూ, ముందుగా ఈ సాంగ్ స్థానంలో వేరొక సాంగ్ ని జోగయ్య గారు రాశారని, అయితే అది ఏ మాత్రం బాగోకపోవడంతో, ఆ విషయాన్ని జోగయ్యగారికి తామిద్దరం చెప్పలేకపోయామని, చివరికి హీరో బన్నీకి వినిపిస్తే బాలేదు సర్ వద్దు అని అన్న తరువాత తామిద్దరం జోగయ్య గారితో ఈ లిరిక్స్ వద్దు సర్ అని చెప్పడం జరిగిందని అన్నారు. అయితే వారిద్దరూ ప్రస్తావించిన ఈ ఘటనతో కొంత ఇబ్బందిపడ్డ రామజోగయ్య శాస్త్రి, నిజానికి ఆ లిరిక్స్ మరీ అంత చెండాలంగా అయితే లేవని, కాకపోతే మనపై మనకు బాధ్యత పెరిగి మరింత మంచి లిరిక్స్ రాద్దాం అని భావించి, చివరకు బుట్టబొమ్మ అనే లిరిక్స్ రాసానని అన్నారు. 

 

అయితే నిజంగా తమకు జోగయ్య రాసినది నచ్చకపోతే వెంటనే చేప్పేయొచ్చు కదా, చివరకు అది హీరో వద్దని చెప్పేదాకా మీలోనే ఉంచుకోవడం ఏంటి, ఫైనల్ గా మంచి అవుట్పుట్ రావాలనే కదా అందరూ ఒక సినిమాకు పనిచేస్తారు, అయినా కూడా ఈ ఆ ఘటనను ప్రస్తావించి జోగయ్య ను ఒకింత కించపరుస్తూ మాట్లాడడం సబబు కాదని, థమన్ అంటే కుర్రాడు కాబట్టి అనుకోకుండా దానిని గుర్తుచేసాడనుకోండి, మీకు మాత్రం మరొక వ్యక్తిని ఆవిధంగా ఇంటర్వ్యూ లో తక్కువ చేసి మాట్లాడడానికి జ్ఞానం ఉండనక్కర్లేదా త్రివిక్రమ్ గారు అంటూ కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: