సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా సెంటిమెంట్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక కాంబినేషన్ లో గనక హిట్ పడితే అదే కాంబినేషన్ ని రిపీట్ చేయడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా హీరో హీరోయిన్, అలాగే హీరో దర్శకుడు వంటి కాంబినేషన్స్ ఎక్కువగా రిపీటవుతుంటాయి. అంతేకాదు ఆ హిట్టు ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. ఒక మంచి సక్సెస్ మేకర్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే సినీజనం ఆ ఒక్క హిట్టు కోసం అంతగా తాపత్రయ పడుతుంటారు. సంవత్సరాలుగా ఒక్క భారీ హిట్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్టు పడక హారిక హాసిని సంస్థ మరియు ఆ సంస్థ అనుబంధ సంస్థ సితార ఎంటర్ టన్ మెంట్స్ ఎంతో బాగా ఇబ్బందులు పడ్డాయి. మంచి సినిమా తీసినా డబ్బులు రాకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలకు ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

 

దాంతో ప్రతిసారీ సినిమా రిలీజయ్యాక.. కాంపన్సేషన్ పేరుతో డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయాల్సిన పరిస్థితి నెలకొనేది. ఏదో రకంగా లెక్కలు సర్ధి చెప్పాల్సిన అవసరం ఉండేది. సితార నిర్మించిన జెర్సీ మంచి క్లాసిక్ సినిమా అని టాక్ వచ్చినప్పటికి ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవడంతో నిరాశపరిచింది. అందుకే ఈసారి అల వైకుంఠపురములో బంపర్ హిట్ కొట్టేయడంతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఫుల్ స్వింగులోకి వచ్చేసింది. 

 

అల ..బ్లాక్ బస్టర్ హిట్టు ప్రభావం తదుపరి ప్రాజెక్ట్ భీష్మపై పడిందట. రీసెంట్‌గా షూటింగుకి ప్యాకప్ చెప్పేసిన సితార వాళ్ళు ఇప్పుడు అల తో వచ్చిన వసూళ్ళు చూసి భీష్మను తిరిగి జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సాంగ్ షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ప్రతిసారీ సినిమా మారాక ఇంకో సినిమా చేయాలంటే మేకర్స్ లో కొంత డైలమా. కానీ ఈసారి అలా లేదు. సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో బంపర్ హిట్ కొట్టింది. అన్ని చోట్లా ఈ సినిమా భారిగా వసూళ్లు సాధించింది.

 

బన్నికి వంద కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చారు. అందుకే ఈ హుషారులో నితిన్ తో భీష్మను పరుగులు పెట్టిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలనే పట్టుదలతో పక్కాగా సినిమాని రూపొందిస్తున్నారట. ఇక ఈ సినిమాలో నితిన్-రష్మిక ల రొమాన్షైలెట్ అని అంటునారు. ఆ విషయం కూడా తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న నితిన్ మీద నెటిజన్స్ సరదాగా ఈ పోస్టర్స్ చూసి ఏంటి నితిన్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నావ్ కదా ఇవేం పాడు పనులు ..? అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: