బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ ఎంతటి గొప్ప వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్‌లో కింగ్‌ ఖాన్ గా పేరు సంపాదించుకున్న అగ్ర‌హీరో. ఇక షారుక్‌ఖాన్‌ పేరు వింటేనే ఆయ‌న మ‌తం ఏంటో చెప్పొచ్చు. రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకుని డ్యాన్స్ ఫ్ల‌స్ 5 షో ఓ ప్ర‌త్యేక ఎపిసోడ్‌ను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా షారుక్‌ఖాన్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. అందులో ముఖ్యంగా త‌న కుటుంబంలో ఎవ‌రే మ‌తం, ఆచార సంప్ర‌దాయాల గురించి ప్ర‌జ‌లతో పంచుకున్నారు. ఈ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు షారుఖ్ వ్యాఖ్యలకు అందరు అభినందిస్తున్నారు.

 

‘కులం వద్దు.. మతం వద్దు.. మనమధ్య హద్దులొద్దు... మనమంతా ఒకటే.. భారతీయులమే’ అని షారుక్ స్ఫూర్తిదాయ‌క‌మైన సందేశాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు. వాస్త‌వానికి ముస్లిం అంటే రోజుకు ఐదుసార్లు న‌మాజ్ చేయాల‌ని చెబుతార‌న్నారు. ఆ నిబంధ‌న ప్ర‌కారమైతే తాను ముస్లిం మ‌తానికి చెందిన వాడినే కాద‌న్నారు. కానీ తాను ఇస్లామిక్‌నేన‌ని, ఇస్లాం మ‌తం చాలా క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇస్లాం సిద్ధాంతాల‌ను నేను విశ్వ‌సిస్తాన‌న్నారు. 

 

త‌న ఇంట్లో అస‌లు ఏమాత్రం మ‌త ప్ర‌స్తావ‌నే రాద‌న్నారు. త‌న భార్య హిందువ‌ని, త‌మ‌కు ఇద్ద‌రు పిల్ల‌ల‌ని చెప్పారు. స్కూల్‌లో త‌న కూతురు మ‌తం ఏమిట‌నే విష‌యాన్ని చెప్పాల్సి వ‌చ్చింద‌న్నారు. స్కూల్ ఫారంలోని మ‌తం ఆప్ష‌న్ వ‌ద్ద భార‌తీయురాలు అని కూతురికి రాసిచ్చిన‌ట్టు షారుక్ గ‌ర్వంగా చెప్పారు. అంతేకాదు, మ‌నంద‌రికీ ప్ర‌త్యేకంగా మ‌త‌మంటూ ఏదీ లేద‌ని, అంద‌రం భార‌తీయుల‌మే అని జ‌నం మ‌ధ్య‌ షారుక్ గ‌ర్వంగా చెప్పారు. ఆ మాటకి చుట్టు పక్కల ప్రాంగణం అంతా చప్పట్ల తో మార్మోగిపోయింది. ఇక ఇలాంటి బ్యాఖ్యలు చేసినందుకు యావత్ ప్రజానికం షారుఖ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక మన బాద్ షా కి గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో నుండి బయట పడటానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: