టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఏ మాయ చేసావే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ సమంత. అయితే ఫస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకున్న సమంతకు అక్కడి నుండి వరుసగా సినిమా అవకాశాలు రావడంతో పాటు మంచి సక్సెస్ లు కూడా లభించాయి. ఇక ఇటీవల నాగచైతన్యని వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటి కోడలైన సమంత, ఒకింత ఆలోచన చేస్తూ జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల పెళ్లి తరువాత యూ టర్న్, మజిలీ, ఓ బేబీ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న సమంత ప్రస్తుతం దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 96 మూవీ రీమేక్ జానులో హీరోయిన్ గా నటిస్తోంది. 

 

ఇటీవల ఈ సినిమా నుండి బయటికొచ్చిన ఒక సాంగ్ తో పాటు నేడు బయటికొచ్చిన రెండవ సాంగ్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న శర్వా,సమంతల గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో జరుగుతోంది. అదేమిటంటే, తమిళంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన 96 మూవీలో హీరో విజయ్ సేతుపతితో పాటు ఆకట్టుకునే రేంజ్ లో హీరోయిన్ త్రిష తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇక సినిమాలో కీలకమైన ఆ పాత్రలో త్రిష అత్యద్భుత నటనకు అక్కడి ప్రేక్షకులు ఎంతో ఫిదా అయ్యారు. నిజానికి ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని త్రిష, ఆ సినిమాతో మంచి పేరు దక్కించుకుంది. 

 

అయితే ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్న జాను లో ఆమె పాత్ర పోషిస్తున్న సమంత, త్రిష మాదిరిగా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. నిజానికి సమంత కూడా ఎంతో గొప్ప నటో మనందరికీ తెలుసు, కాకపోతే ఆల్రెడీ ఒక భాషలో ఒకరు నటించి మంచి పేరు దక్కించుకున్న అదే పాత్రని, మళ్ళి వేరొక భాషలో నటించి మెప్పించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదని, అయితే జాను ఫస్ట్ లుక్ టీజర్ ని బట్టి చూస్తుంటే, త్రిష రేంజ్ లోనే సమంత కూడా సినిమాలో ఆకట్టుకునే నటనను ప్రదర్శించి ఉంటుందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. కాగా ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: