మెగాస్టార్ అభిమానిగా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా కొనసాగించి మళ్లీ కామెడీ వేశాలు వేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న సునీల్ ఈమధ్య మళ్లీ ప్రేక్షకులను అలరించే రోల్స్ చేస్తున్నాడు. అరవింద సమేత సినిమాతో మళ్లీ కమెడియన్ గా మారిన సునీల్ చిత్రలహరితో హిట్ అందుకున్నాడు. హీరోగా వర్క్ అవుట్ అవదని తెలుసుకున్న సునీల్ మళ్లీ కమెడియన్ గా చేస్తున్నాడు. సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా సునీల్ కమెడియన్ గా చేశాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రవితేజ డిస్కో రాజా సినిమాలో విలన్ గా సర్ ప్రైజ్ ఇచ్చాడు సునీల్.

 

ఇదిలాఉంటే ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీతో ఉంటూ మెగా అభిమానిగా అవకాశాలు అందుకున్న సునీల్ నందమూరి బాలకృష్ణతో కలిసి నటిస్తున్నాడు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో సునీల్ కు మంచి పాత్ర దక్కిందట. హీరో పక్క త్రూ అవుట్ సినిమా మొత్తం ఈ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం కెరియర్ లో అటు ఇటుగా ఉన్న సునీల్ కు ఇదో గొప్ప అవకాశమని చెబుతున్నారు. 

 

మెగా అభిమానిగా నందమూరి నట సిం హం బాలకృష్ణతో నటించడం అంటే సునీల్ కు కరెక్ట్ టైం కు కరెక్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో విలన్ గా కూడా బాలీవుడ్ స్టార్స్ నుండి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో బాలయ్య మళ్లీ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్య బాలయ్య బాబు గుండుతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది ఈ సినిమా కోసమే అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అందులో నిజం ఎంతన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి డీటైల్స్ అన్ని త్వరలో బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: