తమిళ స్టార్ హీరో విజయ్  నటిస్తున్న 64వ చిత్రం  మాస్టర్ ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది. సర్కార్ , బిగిల్ ఇలా వరస బ్లాక్ బాస్టర్ లతో విజయ్  ఫుల్ ఫామ్ లో ఉండడం అలాగే గత ఏడాది  ఖైదీ సినిమా తో సెన్సేషనల్ హిట్  కొట్టి  హాట్ ఫేవరేట్  డైరెక్టర్  గా మారిన లోకేష్ కనకరాజ్ మాస్టర్ ను  డైరెక్ట్ చేస్తుండడం వీరితో పాటు ఇందులో మరో స్టార్ నటుడు  విజయ్ సేతుపతి  విలన్ గా నటిస్తుండడం తో  ఈ చిత్రం పై కోలీవుడ్ లో అంచనాలు మామలు గా లేవు. ఇంకా షూటింగ్ పూర్తి కాక  ముందే  అప్పుడే  ప్రపంచ వ్యాప్తంగా  ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయింది. 
 
ఇక ఈ చిత్రం నుండి ఇంతకుముందు  మొదటి లుక్ మరియు రెండవ లుక్ విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  ఈరెండు లుక్ లలో కేవలం విజయ్ మాత్రమే కనిపించాడు. అయితే ఈ రోజు మూడో లుక్ విడుదలకాగా అందులో  విజయ్ తోపాటు విజయ్ సేతుపతి  కూడా వున్నాడు. వీరిద్దరూ చొక్కాలు లేకుండా గాయాలతో  ఒకరి పై ఒకరు అరుచుకున్నట్లు కనిపించారు.  బహుశా క్లైమాక్స్ ఫైట్ లోని ఓ సన్నివేశాన్ని  ఈ మూడో లుక్ పోస్టర్ తో చూపించివుంటారు.  ఇక ఈ లుక్  కూడా అదిరిపోయిందనే టాక్ వస్తుంది. 
 
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆండ్రియా జెర్మియా ,అర్జున్ దాస్, శంతన్  భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని  భారీ బడ్జెట్ తో ఎక్స్ బి క్రియేటర్  నిర్మిస్తుంది. ఈచిత్రాన్ని తెలుగులో యువ నిర్మాత mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు విడుదలచేయనున్నాడు. ఏప్రిల్ 9న ఈ చిత్రం విడుదలకానుందని సమాచారం.  త్వరలోనే ఈ విడుదల తేదీ గురించి  అధికారిక ప్రకటన వెలుబడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: