టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని కింగ్ నాగార్జున పరిచయం అక్కర్లేని పేరు.. రసిక సినిమాలలో నటించాలన్న..భక్తి రసంలో ముంచేయలన్న ఒక్క నాగ్ వల్లే సాధ్యమని చెప్పాలి...అలాంటి నాగ్ ఎన్నో సినిమాలలో నటించాడు.. అయితే ఈ మధ్య నాగ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదని అర్థమయింది.. మొన్న వచ్చిన మన్మథుడు 2 సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోవడంతో సినిమాలకు కొంచం గ్యాప్ తీసుకున్నాడు.. 

 

కాగా, నాగ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సాల్మన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు..పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ‘వైల్డ్ డాగ్’లో ఒక యాక్షన్ రోల్ చేసేందుకు సయామీ రెడీ అవుతోంది.యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా నాగార్జున నటిస్తున్నారు. సయామీ ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నది. అయితే ఈ అమ్మడు రెండో షెడ్యూల్ షూట్ లో పాల్గొన్న బోతుంది.. 

 

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం విశేషం. అంటే, తెలుగు తెరపై ఇంతదాకా మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు.

 

అయితే ఈ సినిమాలో నటిస్తున్న బ్యూటీ మాట్లాడుతూ..ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగార్జున గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన గౌరవం. యాక్షన్ ఫిల్మ్ చెయ్యాలనేది ఎప్పట్నుంచో నాకున్న కోరిక. ఎందుకంటే ఆ జానర్ సినిమాలను నేను ఇష్టపడతాను. ఇక ఇందుకోసం మార్షల  ఆర్ట్ ప్రత్యేక శిక్షణను కూడా తీసుకుంటుంది..మరి సినిమా లో ఎలా ఉండబోతుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: