కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీ తెలుగు రీమేక్ గా వస్తున్న సినిమా జాను. ఈ సినిమాలో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిల సినిమా సూపర్ హిట్ అవగా ఆ మ్యాజిక్ రిపీట్ చేసేలా జానుని క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ తెలుగు జానుని రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అక్కడ మ్యూజిక్ అందించిన గోవింద్ వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మొదటి సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అవగా సినిమా నుండి సెకండ్ సాంగ్ ఈరోజు రిలీజైంది.

 

ఊహలే.. ఊహలే సాంగ్.. తమిళంలో కాదలే.. కాదలే సాంగ్ డిటో దించేసిన గోవింద్ తెలుగులో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేశారని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ సాంగ్ తమిళ్ వర్షన్ తెలుగులో కూడా సూపర్ హిట్టయ్యింది. అంతేకాదు చాలామంది రింగ్ టోన్స్ గా కూడా పెట్టుకున్నారు. అయితే దానికి ఏమాత్రం తీసిపోనివిధంగా తెలుగు వర్షన్ ఉంది. ఊహలే ఊహలే అంటూ వచ్చిన ఈ సాంగ్ సంగీత ప్రియులను అలరిస్తుంది.

 

గోవింద్ వసంత్ సంగీతం అందించగా చిన్మయి శ్రీపాద ఈ సాంగ్ పాడటం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకున్న జాను సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ ప్లాన్ చేశారు. అక్కడ విజయ్, త్రిష కలిసి నటించిన 96 ఎలాంటి హిట్ అయ్యిందో శర్వానంద్, సమంతలు కలిసి అదే రేంజ్ హిట్టు కొడతారని అంటున్నారు సిని విశ్లేషకులు. పెళ్లి తర్వాత సమంత సెలెక్టెడ్ సినిమాలు చేస్తుండగా 96 తెలుగు వర్షన్ జానులో నటించడం ఆమె క్రేజ్ కూడా సినిమాకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ కెరియర్ కు ఈ మూవీ చాలా స్పెషల్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: