టాలీవుడ్ నటుడు మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా. యువ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమా పై రవితేజ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు చాలావరకు నెగటివ్ టాక్ రావడం జరిగింది. 

 

ఇక నిన్న, ఇవ్వాళా కూడా వీకెండ్స్ కావడంతో సినిమాకు బాగానే కలెక్షన్స్ వచ్చాయని, ఇక రేపటి నుండి సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు, అల సినిమాలు మెజారిటీ థియేటర్స్ లో నడుస్తూ ఉండడం కూడా ఈ సినిమాకు నష్టం చేకూర్చే అతి పెద్ద ప్రతికూలాంశం అని వారు అంటున్నారు. మంచి సైన్స్ ఫిక్షన్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకున్న దర్శకుడు విఐ ఆనంద్, దానిని ప్రేక్షకనాడిని పట్టేలా ముందుకు తీసుకెళ్లడంలో విఫలం అయ్యాడని, గతంలో ఆయన తీసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా

 

ఒక్క క్షణ సినిమాలు గమనిస్తే, అవి పూర్తి సినిమాలోని పాయింట్ ని బేస్ చేసుకుని నడుస్తాయని, అయితే ఈ డిస్కో రాజా మాత్రం, ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్నా, సెకండ్ హాఫ్ పూర్తిగా రొట్ట రొటీన్ ఫార్ములాతో నడిచి ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే ఉన్నప్పటికీ, ఆ పాయింట్ కూడా కొత్తదేమీ కాదని అంటున్న వారు కూడా లేకపోలేదు. ఇక తమ సినిమా ఫ్రీకింగ్ హిట్ అంటూ ప్రకటిస్తున్న డిస్కో రాజా మూవీ టీమ్ పై కొందరు నెటిజన్లు ఈ విధంగా సోషల్ మీడియా వేదికల్లో ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. మీ సినిమా చూస్తుంటే ప్రేక్షకులు ఫ్రీకవుట్ కాదు బ్రదరూ, థియేటర్స్ నుండి వాకవుట్ చేస్తున్నారు అక్కడ అంటూ కొందరు, ఇంకొందరు అయితే దేవుడే ఈ సినిమాని కాపాడాలి అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: