ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్, ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య ఎన్నో కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా హీరోల సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ భారీ హిస్టారికల్ మూవీలో రామ్ చరణ్ అల్లూరిగా, అలానే ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇకపోతే అనుకున్న ప్రకారంగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేస్తాం అని ఇటీవల కూడా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించింది. 

 

అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా విడుదల తేదీ మారిందని, అనుకున్న డేట్ కు కాకుండా దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఒక వార్త విపరీతంగా ప్రచారం అయింది. అయితే విడుదల తేదీ మార్పు పై ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడినట్లు చెప్తున్నారు. 

 

ఇటీవల కొద్దిపాటి కోర్ట్ కేసుల్లో ఇరుక్కుని ఒకింత వాయిదా పడ్డ ఈ సినిమాకు సంబంధించి ఇంకొంత వర్క్ బ్యాలన్స్ ఉన్నందున, సినిమాను అనుకున్న విధంగా సమ్మర్ కి కాకుండా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని చూస్తుందట కెజిఎఫ్ యూనిట్. అయితే దీనిపై ఇప్పటివరకు ఆ మూవీ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం లేనప్పటికీ, మరోవైపు ఈ వార్త అటు కన్నడనాట కూడా విపరీతంగా హల్ చల్ చేస్తుండడంతో, కొందరు ప్రేక్షకులు అది జరిగినా జరగవచ్చని అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కనుక మారితే, అది సినిమా లవర్స్ కు అతి పెద్ద చేదు వార్తే అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: