రాజమౌళి సినిమాలలోని యాక్షన్ సీన్స్ కొన్ని ఇంగ్లీష్ సినిమాల యాక్షన్ సీన్స్ కు కాపీగా ఉంటాయి అంటూ అనేకసార్లు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ‘మగధీర’ ‘బాహుబలి’ సినిమాలలోని యాక్షన్ సీన్స్ అనేక హాలీవుడ్ సినిమాలను గుర్తుకు చేస్తాయి అంటూ చాలామంది ఓపెన్ గానే జోక్ చేస్తారు. 

అయితే రాజమౌళి ఈ విషయాలను అంగీకరించకుండా కాపీ వేరు అనుసరణ వేరు అంటూ ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకు వచ్చి తాను కేవలం కొన్ని హాలీవుడ్ సినిమాల యాక్షన్ సీన్స్ ను అనుకరిస్తాను కాని తాను కాపీ మాష్టర్ ను కాను అంటూ ఓపెన్ గానే అనేకసార్లు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లోని ఒక భారీ యాక్షన్ సీన్ హాలీవుడ్ మూవీ ‘ది 300’ కు కాపీ అంటూ ప్రచారం మొదలైనది. 

హాలీవుడ్ మూవీలో హీరోకు ఒక భయంకరమైన తోడేలు కు జరిగే పోరాట సన్నివేశాన్ని ప్రేరణగా తీసుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ లో జూనియర్ సింహం తో చేసే భారీ యాక్షన్ ఫైట్ సీన్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి యాక్షన్ సీన్ బల్గేరియ షెడ్యూల్ లో చిత్రీకరింప బడింది. అయితే ఈ యాక్షన్ సీన్ చూసిన వారికి ‘ది 300’ మూవీలోని యాక్షన్ సీన్ వెంటనే గుర్తుకు వస్తుంది అని అంటున్నారు. 

అంతేకాదు ‘బాహుబలి’ మూవీలో రానా ఎద్దు తో చేసిన యాక్షన్ సీన్ కన్నా చాల భయంకరంగా నిజంగానే జూనియర్ సింహంతో పోరాడుతున్నాడా అన్న భ్రమ కలిగించే విధంగా డిజైన్ చేయబడ్డ ఈ యాక్షన్ సీన్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు అత్యంత కీలకం అని అంటున్నారు. వాస్తవానికి ఈ విషయం అందరికీ తెలియడానికి గల కారణం ఈ యాక్షన్ సీన్ ఈమధ్య బయటకు లీక్ అవ్వడం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాజమౌళి అపరమత్తమై సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఆ వీడియోను తొలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినా ఈ లీక్ వీడియోను చూసిన వారు వెంటనే ఈ సీన్ ‘ది 300’ కు కాపీ అంటూ ప్రచారం మొదలు పెట్టేశారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: