స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన విష‌యం తెలిసిందే. న‌య‌న్‌, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లు పోషించ‌గా..సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ రాంచ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు పెద్ద హిట్ కాలేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రంతో కాస్త ప్రేక్ష‌కుల‌ను నిరాశ పెట్టిన చిరు ఇప్పుడు కొర‌టాల‌తో క‌లిసి త‌న 152వ చిత్రాన్ని శ‌ర‌వేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం మొదలైన‌ప్ప‌టి నుంచి కూడా ఏదో ఒక విష‌యంలో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. 

 


ఇక  ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటుగా అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మ‌ధ్య అవి మ‌రింత‌గా బ‌ల‌ప‌డ్డాయి. ఇక ఈ చిత్రంలో ఆయ‌న‌కి సంబంధించిన సీన్స్ క‌నీసం 20 నుంచి 30 నిమిషాల వ‌ర‌కు ఉంటాయ‌ని ఏకంగా నిడివి కూడా చెప్పేస్తున్నారు. ఇక తండ్రీ కొడుకులిద్ద‌రి పై తీసే సీన్లు కొర‌టాల శివ చాలా జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌కి ఎక్క‌డా పొక్క‌కుండా ఎంతో ప‌క‌ట్బందీగా తీసుకున్నార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత గాసిప్‌లా వ‌చ్చిన‌ప్ప‌టికీ దీని పై ఎవ్వ‌రూ కూడా స్పందించ‌క‌పోయేస‌రికి ఇది నిజ‌మ‌వుతుందోమో అని అంద‌రికీ అనిపిస్తుంది. 

 

కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు దీని పై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎంతో ఫాస్ట్‌గా కొర‌టాల తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. దాని కోసం ఆయ‌న చిరంజీవితో స‌హా క‌లిసి ఎవ్వ‌రినీ నిద్ర‌పోనివ్వ‌కుండా అదే ప‌నిగా ప‌గ‌లు రాత్రి షూటింగ్ నిర్వ‌హిస్తున్నార‌ట‌. మ‌రి ఇంత త్వ‌ర‌గా చెయ్య‌డానికి కూడా కార‌ణాలు లేక‌పోలేదు. ఈ మ‌ద్య ఓ సినిమా ఫంక్ష‌న్‌లో చిరు సినిమాని ఎంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేస్తే అంత మంచిదంటూ కొర‌టాల‌కు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: