జనాలకోసం జనసేన పార్టీని స్థాపించిన రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇక సినిమాల జోలికి వెళ్లనని ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనని తానే స్వయంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఆ తర్వాత ఒట్టేసిన మాట తీసి గట్టు మీద పెట్టి మళ్లీ బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్టయిన ‘పింక్’ రీమేక్ ద్వారా పవన్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల చాలా సైలెంట్ గా ఈ సినిమా కూడా షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ఈ సినిమాలో నటీనటులెవరు..? అనే విషయం తెలియరాలేదు. నివేదా థామస్, అంజలి నటిస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. సూపర్ హిట్ సినిమాలని రూపొందించే నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పవన్ లేకుండానే కొన్ని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేయగా.. తాజాగానే జనసేనాని మొహానికి రంగేసుకొని రంగంలోకి దిగారు.

 

ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్‌ క్రిష్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ‘పింక్’ రీమేక్ కంప్లీటయిన వెంటనే  క్రిష్‌ తెరకెక్కించే షూటింగ్‌లో జాయినవ్వాలని ఆయన ఫిక్సయ్యారట. ఈ సినిమా స్టోరీ చాలా బాగా నచ్చడంతో నో చెప్పలేక పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ సినిమాలో మొందెన్నడూ లేని విధంగా పవన్‌ను క్రిష్ చూపించబోతున్నారట.  ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు కూడా అంతంత మాత్రం డైరెక్టర్స్ కావడం.. హిట్ చూసి చాలా రోజులు కావడంతో ఈ ఇరిద్దరూ ఎలా తెరకెక్కిస్తారో..? ఏంటో..? సినిమా హిట్ అయితే పర్లేదు.. ఫ్లాప్ అయ్యే పరిస్థితులు ఉంటే ఏంటి..? అని పవన్ వీరాభిమానులు టెన్షన్ టెన్షన్ పడుతున్నారట. ఈ విషయంలో ఫ్యాన్సే కాదు పవన్ కూడా కాస్త హడావుడి పడుతున్నాడట. రీ ఎంట్రీ మూవి ఆ తర్వాత మూవి బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం హిట్ టాక్ వచ్చినా చాలు. 

 

మరి ఈ ఇద్దరు డైరెక్టర్స్ అలా హిట్ టాక్ వచ్చే సినిమాలని పవన్ కి ఇస్తారా ..? అయితే.. పవన్ ప్రతీసారి ఇలాంటి తప్పులెందుకు చేస్తున్నాడు..? ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, కాటమరాయుడు’,‘అజ్ఞాతవాసి’ లాంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో పవన్ ఇక సినిమాల వైపు రాలేదు. అయితే ఎటూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి మంచి ఫేమస్ డైరెక్టర్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలి గాని.. ఇలా ఎందుకు ఒప్పుకున్నట్లు..? అని మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. మరోవైపు.. జనసేనాని ఇమేజ్‌, క్రేజీకి తగ్గ డైరెక్టర్లు ఈ ఇద్దరు కాదని ఇండస్ట్రీలో చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: