నిన్న భాగ్యనగరంలో భారతమాత ఫౌండేషన్ ఆద్వర్యంలో నక్లెస్ రోడ్ లో జరిగిన భరత మాత మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను పదవులు ఆశించి రాజకీయాలలోకి రాలేదనీ తన వంతుగా ప్రజా సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. 


వాస్తవానికి మొదటి తాను మొదట భారతీయుణ్ణి అని చివరగా కూడా తాను భారతీయుడుగానే కను మూస్తాను అంటూ తన దేశ భక్తిని చాటుకున్నాడు. తన తండ్రి చనిపోయినప్పుడు వారణాసిలో అస్థికలు కలపడానికి వెళ్లిన సమయంలో ముంబైలో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మూడు రోజులు దాడులు చేశారన్న విషయం తెలుసుకుని ఆ ఘటన తనను కలచి వేసింది అంటూ కామెంట్ చేసాడు.   

ప్రస్తుతం పక్కదేశాలు భారత్ వైపు చూడాలనుకుంటే భయపడి పోతున్నాయని ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశం చాల బలంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అలాంటి బలమైన మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలోను అభివృద్ధి సాదిస్తున్న విషయాలను గుర్తుకు చేసాడు. 

దేశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దేశంలోని అందర్నీ ఒకే మార్గంలో నడిపించే సమర్థత మోడీ కి ఉంది అని చెపుతూ దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మోడీ వమ్ము చేయలదేని అంటూ పవన్ మోడీ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. వాస్తవానికి పవన్ జనసేన ఎదో ఒక రోజున భారతీయ జనతా పార్టీలో కలిసి పోతుంది అని ఊహాగానాలు వస్తున్న పరిస్థితులలో పవన్ నోటి వెంట నిన్న మోడీ పై వచ్చిన ప్రశంసలు భవిష్యత్ పవన్ రాజకీయాలకు సంకేతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అత్యంత ఉత్సాహ భరితంగా దేశ భక్తి మిళితమైన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై తో పాటు అనేకమంది ప్రముఖులు రాజకీయ వేత్తలు పాల్గొన్న ఈ మహా హారతి కార్యక్రమంలో పవన్ పాల్గొనడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: