స్టార్ హీరోలు ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ నే ప్రిఫర్ చేస్తుంటారు. టాప్ రేస్ లో దూసుకెళ్తున్న మేకర్స్ తోనే సినిమాలు ప్లాన్ చేస్తారు. కానీ రజినీకాంత్ మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నాడు. యంగ్ మేకర్స్ ని వెతికిమరీ సినిమాలు చేస్తున్నాడు. మరి తలైవా రివర్స్ లో వెళ్లడానికి కారమేంటో తెలుసా..!

 

స్టార్ హీరోలు ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తుంటారు. అయితే రజినీకాంత్ మాత్రం కబాలి నుంచి యంగ్ మేకర్స్ కే పిఫరెన్స్ ఇస్తున్నాడు. సిినిమాల ఎక్స్ పీరియన్స్ తో పనిలేకుండా కుర్రాళ్లతోనే సినిమాఓలు చేస్తున్నాడు. రంజిత్ తో కబాలి, కాలా చేసిన రజినీ మరో యంగ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజుదర్శకత్వంలో పేట మూవీ చేశాడు. 

 

రజినీకాంత్తర్వాత లోకేశ్ కనగరాజు దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఖైదీతో కార్తీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేశ్ తో సినిమా చేసేందుకు రజినీ ఒకే చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. ఖైదీ మేకింగ్ కు ఫుల్లుగా ఇంప్రెస్ అయిన తలైవా లోకేష్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. 

రజినీకాంత్ స్టార్స్ తో కాకుండా యంగ్ మేకర్స్ ని ప్రిఫర్ చేసేందుకు ట్రెండే కారణమంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా వైవిధ్యమైన కథలకే ఓటేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ని అంతగా పట్టించుకోవడం లేదు. అందుకే కొత్త కథలు రాస్తారనే నమ్మకంతో యంగ్ మేకర్స్ కు అవకాశాలు ఇస్తున్నారు రజినీకాంత్. 

 

సూపర్ స్టార్ కు రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా మొదలుపెడుతున్నాడు అని తెలిస్తే చాలు ఫ్యాన్స్ ఎపుడుడెపుడు తెరపైకి వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. రజినికాంత్ డైలాగ్ డెలివరీ స్టైల్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఆ స్టైల్ ను ఫాలో అయ్యేవారు కూడా లేకపోలేదు. అందుకే రజినీ కాంత్ కొత్తకొత్త గెటప్స్ లో మెరిపిస్తుంటారు. యంగ్ డైరెక్టర్ లకు ఛాన్స్ లిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. కొత్త డైరెక్టర్ లతో.. కొత్త సినిమాలు చేస్తూ కొత్త దనాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: