అందాల ముద్దుగుమ్మ రష్మిక.. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై  మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే దర్శకనిర్మాతలందరిని  ఆకర్షించి  తనదైన స్టైల్లో దూసుకుపోతుంది ఈ అమ్మడు. వరుస  సినిమా అవకాశాలు దక్కించుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన. ఈ అమ్మడు అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మతి పోగొట్టేసింది. ఇక ఈ అమ్మడి చిలిపితనం అందరిని మెస్మరైజ్ చేసింది. మొన్నటివరకు విజయ్ దేవరకొండ తో జోడి కట్టి సంచలన విజయాన్ని నమోదు చేసిన రష్మిక మందన కు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కింది. 

 

 

 తాజాగా సూపర్ స్టార్  మహేష్ బాబు  సరసన సరిలేరు నీకెవ్వరు సినిమా లో హీరోయిన్ గా నటించింది రష్మిక మందన. ఈ సినిమాలో తన నాటి చేష్టలతో ... చిలిపి నవ్వుతో యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు సినిమా లో రష్మిక చెప్పిన కొన్ని డైలాగ్స్ అయితే ఇప్పటికే ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. అంతలా ప్రభావితం చేసింది రష్మిక మందన్న ఇక ఈ సినిమాలో డాన్సులతో కూడా ఆదరగొట్టేసింది . ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. టాలీవుడ్లో తనదైన సత్తా చాటుతూ దూసుకుపోతున్న రష్మిక మందన కు ప్రస్తుతం మరో స్టార్ హీరో సరసన నటించేందుకు అవకాశం వచ్చింది. 

 

 

 త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కబోతున్న సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తున్న తరుణంలో... చిత్ర బృందం రష్మిక ను తీసుకుంటే బాగుంటుంది అని నిర్ణయించిందట. ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుండగా సినిమాలో రష్మిక  అయితేనే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకొన్ని రోజుల్లో రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: