మాస్ట‌ర్ భ‌ర‌త్‌.. అన్న పేరు క‌న్నా చిట్టి నాయుడిగా అయితే ఈజీగా ప‌ట్టేస్తారు తెలుగుప్రేక్ష‌కులు. `రెడీ` సినిమాలో చిట్టి నాయుడిగా మాస్టర్ భరత్ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు.  బొద్దుగా ఉంటూ తన ఆకారంతో, తనదైన డైలాగ్ డెలివరీ, ముఖ కవలికలతో ప్రేక్షకులను అలరించాడు. వెంకీ,  ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు ఈయ‌న‌. అయితే చాలా గ్యాప్ తీసుకుని పెద్దవాడై అల్లు శిరీష్  `ఏబిసిడిలో` చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఏంటి ఈయ‌న నిజంగానే భ‌ర‌తా.. మాస్ట‌ర్ భ‌ర‌తా.. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడు.

 

ఎందుకంటే చాలా స‌న్న‌గా.. హ్యాండ్‌స‌మ్‌గా మారిపోయాడు భ‌ర‌త్‌. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్న భరత్  మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తన కుడి కన్ను కనిపించదు అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. దీంతో అక్క‌డ ఉన్న‌వాళ్లంతా షాక్ అయ్యారు. అలాగే మెడిసిన్ పూర్తి చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ల‌వ్ స్టోరి కూడా లేద‌ట‌ భ‌ర‌త్‌కు. అయితే ప్రపోజ‌ల్స్ వ‌చ్చేవ‌ట‌. కాని.. అక్క‌డే ట్విస్ట్‌ ఉండేద‌ట‌. భ‌ర‌త్‌ చెన్నైలో కాలేజ్ జాయిన్ అయిన‌ప్పుడు బాగా సన్నబడ్డాట‌. ఎందుకంటే ఆసందర్భంలో త‌న‌కు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. అత‌ని కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అత‌ని కన్ను ఒకటి పనిచేయదు. కళ్ల జోడుతోనే తిరిగేవాడ‌ట‌. 

 

అంతేకాకుండా వర్కౌట్ చేస్తున్నప్పుడు రాడ్‌లో ఉండే స్ప్రింగ్ కూడా వచ్చి కన్నుకి గట్టిగా తగిలేసింద‌ట‌. అయితే డాక్ట‌ర్లు మెడిసిన్ ఇస్తే కవర్ కావచ్చు చెప్పార‌ట‌. ఇక ఆ త‌ర్వాత తాను కాలేజ్‌కు వెళ్లే సరికి గుంపులు గుంపులుగా ఉన్నార‌ట‌.  తాను తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు కాలేజ్ బస్‌ పక్క సీట్‌లో త‌న‌ సీనియర్ ఒకరు కూర్చుని తమ్ముడు మీ క్లాస్‌లో ఎవడో యాక్టర్ ఉన్నాడట కదా.. వస్తే చెప్పు మాట్లాడతా అన్నార‌ట‌. అది నేనే అన్నయ్య అని భ‌ర‌త్ చెప్పినా అత‌ను న‌మ్మ‌లేద‌ట‌. ఎందుకంటే భ‌ర‌త్ అప్ప‌టికే బాగా సన్నబడ్డాడు. అయితే పక్క క్లాస్‌లో లావుగా ఉండే అబ్బాయిని.. తాను అనుకుని  అంద‌రూ వాడికి ప్రపోజ్‌లు చేసేవార‌ట‌. దీంతో చాలా బాధ ప‌డ్డాడ‌ట భ‌ర‌త్‌.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: