ఈ మధ్యకాలంలో బుల్లితెర నటులకు గాని, సినిమా రంగంకు చెందిన వారు గాని, ప్రమాదాల బారిన పడటం. లేదా ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా అనారోగ్యాల బారినపడి మరణించడం జరుగుతుంది.. ఇలా ఇప్పటి వరకు, బుల్లితెర నటీమణులు చాలా మంది ఆత్మ హత్యలకు ప్రయత్నించారు, అందులో మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక 2019 లో మాత్రం చాల మంది సినీ, టీవి నటులు, నటీమణులు మరణించిన విషయం తెలిసిందే. అందుకే మరణం ఎవరికి అతీతం కాదు. అందరు ఏదో ఒకప్పుడు పోవలసిన వారే.

 

 

ఇకపోతే తాజాగా మరో బుల్లితెర నటుడు మరణించారు. ఆయన పేరు సంజీవ కులకర్ణి.. ఈయన ప్రముఖ బుల్లితెర నటుడు, అంతే కాదు వ్యాఖ్యాత గా కూడా వ్యవహరించాడు.. ఈయన వయస్సు సుమారుగా 49 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇకపోతే సంజీవ కులకర్ణి 15 ఏళ్లుగా కార్డియోమయోపతితో ఇబ్బంది పడుతున్న ఈయన ఇటీవల అస్వస్థతకు గురై నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 

 

సంభ్రమ-సౌరభ పేరిట ప్రతినెలా ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న కులకర్ణి కన్నడలో పాపులారిటి పొందిన సీరియల్స్ నాగిని, రాజారాణి, ఏటు-ఎదురీటులో కూడా నటించారు. అంతే కాదు నాగిని సీరియల్ తెలుగులో కూడా జెమినీ టీవిలో ప్రసారమై మంచి రేటింగ్ సాధించుకుంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన అతను పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందినా ఫలించలేదు.

 

 

ఇకపోతే సంజీవ కులకుర్ణి మృతి పట్ల పలువురు నటులు, దర్శకులు, బుల్లితెర తారలు కదిలివచ్చి నివాళులర్పించారు. కాగా ఈ యన కుమారుడు అయినా సౌరభ్ కులకర్ణి కూడా నటుడే.. ఆయన కూడా పలు సీరియల్లో నటిస్తున్నాడట.. ఈ సందర్భంగా సంజీవ కులకుర్ణి మృతి పట్ల పలువురు నటీనటులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: