టాలీవుడ్ కి ఈ ఏడాది తొలి అడుగే ఘనంగా ప్రారంభమైంది. పోటీలు పడి మరీ వచ్చిన మహేశ్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల.. వైకుంఠపురంలో సినిమాల్లో అల.. భారీ కలెక్షన్లు సాధిస్తోంది. రిలీజ్ రోజు తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సాధించి భారీ వసూళ్లు సాధించింది. బన్నీ కెరీర్ లోనే తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాలీవుడ్ లో రంగస్థలం, సైరా రికార్డులను తిరగరాయడానికి దూసుకెళ్తోంది. త్రివిక్రమ్, బన్నీ, థమన్.. సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టేశారు.

 

 

అల.. ఇప్పుడు ముడో వారంలోకి ఎంటరైంది. ఇప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. సరిలేరు.. స్పీడ్ తగ్గడం, రవితేజ డిస్కో రాజా ఫ్లాప్ టాక్ రావడం అల.. కు బాగా కలిసొచ్చింది. ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. మూడో వారం కూడా అల.. కు ఎదురులేనట్టే. ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది. యూఎస్ మార్కెట్లో నాన్ బాహుబలి రికార్డు పేరు మీద ఉన్న రంగస్థలం రికార్డు 3.5 మిలియన్ల కలెక్షన్లను ఒకటి రెండు రోజుల్లో దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. లాంగ్ రన్ లో 4మిలియన్ల మార్క్ చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. నాపేరు సూర్య.. ఫ్లాప్ తర్వాత బన్నీ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తున్నాయి.

 

 

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ మ్యాజిక్ సినిమాను నిలబెట్టేసిందనే చెప్పాలి. మూడు నెలలుగా జనాల్లోకి వెళ్లిన పాటలు.. మేకింగ్ కూడా అదేస్థాయిలో ఉండేప్పటికి అంచనాలు అందుకుని ఇండస్ట్రీ హిట్ అయింది. త్రివిక్రమ్ భాషలోనే చెప్పాలంటే.. మంచి కాఫీకి షుగర్ యాడింగ్ లా థమన్ మ్యూజిక్ పనిచేసిందనే చెప్పాలి. లాంగ్ రన్ లో అల.. మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: