యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న అనసూయ ‘రంగస్థలం’ మూవీలో చేసిన రంగమత్త పాత్రతో ఆమెలోని నిజమైన నటన బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సుకుమార్ అల్లు అర్జున్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీలో ఆమెకు మరొక కీలక పాత్ర ఇచ్చిన విషయం తెలిసిందే. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో అనసూయ పాత్ర నెగిటివ్ టచ్ తో లేడీ విలన్ గా ఉండటమే కాకుండా ఆమె కొన్ని ఫైట్స్ కూడ చేస్తుందని అంటున్నారు. దీనికోసం ప్రస్తుతం అనసూయ ఒక ఫైట్ మాష్టర్ దగ్గర శిక్షణ తీసుకునే లా సుకుమార్ ఏర్పాటు చేసినట్లు టాక్. 

త్వరలో షూటింగ్ కాబోతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తూ పూర్తిగా భారీ గెడ్డం తో లుంగీ అవతారంలో సినిమా మొత్తం కనిపిస్తాడని లీకులు వస్తున్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఉండే ఈ కథలో డైలాగ్స్ అన్నీ చిత్తూరు యాసలో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రతిరోజు రెండు గంటల పాటు చిత్తూరు యాస పై పట్టు సాధించడానికి రెండు గంటల పాటు ఆప్రాంత యాసకు సంబంధించిన డైలాగ్స్ పలకడంలో శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో అనసూయ నటించే సన్నివేశాలు అన్నీ బన్నీ తోనే ఉంటాయని ఆమె బాడీ లాంగ్వేజ్ చాల డిఫరెంట్ గా ఉండే విధంగా ఈమూవీలో అనసూయను ప్రత్యేకంగా సుకుమార్ చూపెట్ట బోతున్నాడని తెలుస్తోంది. దీనికితోడు బన్నీ కెరియర్ లో ఇప్పటి వరకు నటించని రఫ్ పాత్ర అల్లు అర్జున్ ఈ మూవీలో చేస్తున్న నేపధ్యంలో ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలి అన్న విషయమై ఇప్పుడు రకరకాల ఆలోచనలు జరుగుతున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తరువాత విడుదల కాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: