ఒక సినిమాలో ఇద్దరు టాప్ నటులు నటిస్తే.. ఆ అంచనాలు వేరుగా ఉంటాయి.  ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి తమిళ మూవీలో జరగబోతుంది.  ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మక్కల్ సెల్వన్ విజయ్,  సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు.  చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఇప్పుడు స్టార్ స్థాయికి ఎదిగిన సేతుపతి ఎలాంటి పాత్రలైనా తనదైన స్టైల్లో నటిస్తున్నారు.  తెలుగు లో గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ లో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు.  హీరో, విలన్, క్యారెక్టర్ దేనికైనా సిద్ద అంటున్నారు విజయ్ సేతుపతి.  మాళవిక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఆండ్రియా, శాంత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ మూవీలో విజయ్ ద్విపాత్రలో కనిపించబోతున్నారట.  

 

స్టూడెంట్ నాయకుడిగా.. మరొకటి టైలిల్ రోల్ లో నటిస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ రెండు లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి విజయ్, విజయ్ సేతుపతి కొదమ సింహాల్లా పోట్లాడుకుంటున్న ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ పై ఈ సినిమాను ఏప్రిల్ 2020ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు.   యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెకెక్కబోతున్నారు.   ఈ మూవీలో ఈ ఇద్దరు నటులు ఏ రేంజ్ లో నటిస్తారో అని తమిళ తంబీలు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.  అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులు  లుక్ బాహుబలిని తలపించే విధంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

గతంలో బాహుబలి పార్ట్ 2 మూవీలో ప్రభాస్ - రానా పోస్టర్ ఇలాగే కనిపించాయి. మాస్టర్ మూవీకి అనిరుధ్ సంగీత దర్శకుడు.  ఇదిలా ఉంటే కొంత కాలంగా విజయ్ హీరోగా నటించిన సినిమాలు రిలజ్ కి ముందు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  మరి ఈ మూవీ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: