ప్రస్తుతం తమిళంలో విజయ్ ని మించిన పెద్ద నటుడు లేడనే చెప్పాలి. మార్కెట్ పరంగా కానీ, ఫాలోయింగ్ పరంగా కానీ రజనీ కాంత్ ని దాటి వెళ్ళిపోయాడు. మొన్నటికి మొన్న వచ్చిన బిగిల్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే బిగిల్ సినిమా తర్వాత విజయ్ లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు.
లోకేష్ కనగరాజ్ ఖైదీ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై అత్యధిక వసూళ్ళు సాధించింది. హీరోయిన్ లేకుండా ప్రయోగాత్మకంగా చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్నన పొందడమే కాదు వసూళ్ళ పరంగానూ బాగా ఆర్జించింది. ఈ చిత్రం హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ కి విజయ్ తో చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో "మాస్టర్" అనే చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇదివరకే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అయితే నిన్న ఈ చిత్ర థర్డ్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ లుక్ తమిళ జనాలకు బాగానే అనిపిస్తోంది కానీ.. తెలుగు వాళ్లు మాత్రం అంతగా నప్పలేదు. మాస్టర్ తాజా పోస్టర్లో తెలుగు సినిమాల స్ఫూర్తి కనిపిస్తుండటమే ఇందుక్కారణం. బాహుబలి: ది కంక్లూజన్‌కు సంబంధించి క్లైమాక్స్ ఫైట్‌లో ప్రభాస్-రానా ఢీకొట్టే దృశ్యాన్ని తలపించేలా ఉంది మాస్టర్ లేటెస్ట్ పోస్టర్.
బాహుబలి స్ఫూర్తి ఉన్నా ఓకే కానీ.. రాజు గారి గది-3 లాంటి చిన్న సినిమా ఫస్ట్ లుక్‌తోనూ దీనికి పోలికలుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆల్రెడీ తెలుగు సినిమా పేరును పెట్టారని అంటున్న నేపథ్యంలో ఇలాంటి మరో వార్త రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ముందు ముందు రిలీజ్ చేసే వాటిల్లోనైనా ఇలా అవకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి.