సినీ నటుడు ప్రకాష్ రాజ్... విలక్షణమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. తెలుగు తమిళం కన్నడ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. పాత్ర ఏదైనా అందులో జీవించి నటించగల సత్తా ప్రకాష్ రాజ్ సొంతం. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో ... కీలక పాత్రల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అయితే గత కొంత కాలంగా సినిమాల్లో తక్కువ కనిపిస్తున్న ప్రకాష్ రాజ్... తన వ్యాఖ్యలతో వార్తల్లో ఎక్కువ గా నిలుస్తున్నారు. 

 

 

 ఇక అసలు విషయానికొస్తే... సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను ఈనెల 29న బుధవారం రోజు హతమారుస్తున్నాము  అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఓ బెదిరింపు లేఖ పంపారు. వీరు హత మార్చాలి అనుకుంటున్నా వారి లిస్ట్ లో మాజీ సీఎం కుమారస్వామి... నిజగుణాందస్వామి సహా 13 మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడ లో రాసి ఉన్న ఈ లేఖలో... అధర్మంతో ముందుకు వెళుతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్న వారిని హత  మార్చేందుకు జనవరి 29న ముహూర్తం నిర్ణయించుకున్నాము  అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు గుర్తుతెలియని వ్యక్తులు. 

 

 

 అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలి అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక గుర్తు తెలియని వ్యక్తులు కన్నడ లో రాసిన ఈ లేఖ నిజగుణాందస్వామి మఠానికి వెళ్ళింది. కాగా ఈ లేఖను జిల్లా ఎస్పీకి అందజేశారు ఆశ్రమ నిర్వాహకులు. హతమారుస్తాముం  అంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాసిన నేపథ్యంలో... ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని చెప్పారు పోలీసులు. అయితే దీనికి మాత్రం నిజగుణాందస్వామి తిరస్కరించారు. ఇక తనను హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయని మాజీ సీఎం కుమారస్వామి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం గుర్తుతెలియని వ్యక్తులు రాసిన ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: