‘మజిలీ’ ‘ఓ బేబి’ సినిమాల తరువాత సమంతకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏ ఆఫర్ ను ఆమె అంగీకరించడం లేదు. ‘96’ మూవీ రీమేక్ గా రాబోతున్న ఒక్క ‘జాను’ సినిమాలో మాత్రమే ప్రస్తుతం ఆమె నటిస్తోంది. హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’  వెబ్ సిరీస్ లోనూ సమంత నటించింది. 

ఇలాంటి సమయంలో సమంతకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఒక మీడియా సంస్థ లీక్ చేసింది. త్వరలో ప్రసారం కాబోతున్న ఒక టాప్ షోని  సమంత హోస్ట్ చేయడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసే ఈ టాక్ షో తెలుగు తమిళ భాషలలో ప్రసారం అవుతుందని అంటున్నారు. 

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు చిరంజీవి నాగార్జున ఆలీ తప్పించి మరెవ్వరు టాక్ షోలను హోస్ట్ చేయలేదు. అయితే తమిళంలో మాత్రం ప్రస్తుతం రాధిక ఇలాంటి టాక్ షోలను హోస్ట్ చేస్తోంది. ఇప్పుడు వీరి మార్గాన్ని ఎంచుకుని సమంత ఒక వెరైటీ టాక్ షో ప్రోగ్రామ్ కు లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బుల్లితెర పై ఎంతోమంది సెలెబ్రెటీలు టాక్ షోలు చేసినా నాగార్జున స్థాయిలో ఎవరు రాణించలేదు. 

ఇప్పటికే అక్కినేని కుటుంబ కోడలుగా తన హవా కొనసాగిస్తున్న సమంత బుల్లితెర పై కూడ రాణించ గలిగితే నాగార్జునకు గట్టి పోటీ ఇచ్చినట్లే అనుకోవాలి. మరో రెండు సంవత్సరాల వరకు తనకు తల్లి అయ్యే ఉద్దేశ్యం లేదు అంటూ ఓపెన్ గానే చెపుతున్న సమంత ఇంకా తన కెరియర్ ను కొనసాగిస్తూ టాప్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించాలని ఉబలాట పడుతున్నా ఆమె నాగార్జునకు కోడలు అయిన దగ్గర నుండి ఆమెతో నటించడానికి టాప్ యంగ్ హీరోలు మాత్రం మొహమాట పడుతున్నారు. ఈ కారణంతో ఆమెకు ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: