ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ నిర్మాత ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బండ్ల గణేశ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ చేసిన పని ఇది. కొన్నేళ్లుగా సినిమాలు తీయక మిన్నుకుండిపోయినా బ్లాక్ బస్టర్ నిర్మాత టైటిల్ మాత్రం గణేశ్ సొంతమే. సినిమాలు తగ్గించి రాజకీయాల్లోకి ఎంటరై మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు. ఆ ఎలక్షన్లకు బూస్ట్ ఇచ్చిన వాళ్లలో గణేశ్ కూడా ఒకడు. సినిమా డైలాగులతో కామెడీని కూడా పంచాడు.

 

 

కానీ.. ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండిపోయి.. వెంటనే అదే రాజకీయాల నుంచి బయటకు వచ్చేశాడు. ఎంతగా బాధ పెట్టాయేమో కానీ.. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను మరచిపోలేనట్టున్నాడు. ‘నాకు తెలిసి నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడం. నాకు తెలిసింది ఒక్కటే. సినిమా సినిమా సినిమా’ అంటూ ట్విట్టర్ లో లేటెస్ట్ గా పోస్ట్ చేశాడు. రాజకీయాల్లో ఉన్న అతి తక్కువ సమయంలో ఆయన చేసిన హడావిడి అలాంటిది. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7o క్లాక్ బ్లేడ్ తీసుకురండి.. పీక కోసుకుంటా అని చాలెంజ్ విసిరి వార్తల్లో నిలిచాడు. ఫలితాల అనంతరం అదే విషయం అడిగితే ‘ఏదో అంటాం.. నిజంగా కోసేసుకోమంటారా’ అంటే తన స్టైల్లో పంచ్ వేశాడు.

 

 

మొన్నటి సరిలేరు.. ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా రాజకీయాలకు తాను దూరం అనే ప్రకటించాడు. అయితే.. మళ్లీ ట్విట్టర్ లో ‘నాకు సినిమాలే ముఖ్యం.. రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశాను’ అంటూ ఎందుకు స్పందిస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. సినిమాలే ముఖ్యం అంటున్న బండ్ల.. తన గాడ్ పవన్ ఎలాగూ సినిమాలు చేస్తున్నాడు. పవన్ తో ఓకే అనిపించుకుంటే సినిమాకు సిద్దమైపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: