చందమామ కథలు సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన నాగశౌర్య ఆ తర్వాత వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరో అయిపోయాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో శౌర్య నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ చిత్రం తర్వాత తాను చేసిన ఏ చిత్రానికి కూడా అంతటి గుర్తింపు రాలేదు. సాఫ్ట్ గా కనిపించే శౌర్య మాస్ చిత్రాల జోలికి వెళ్లలేదు.

 

 

ఇది వరకు జాదూగాడూ అనే చిత్రం చేసినప్పటికీ, అది నిరాశనే మిగిల్చింది. దాంతో మళ్ళీ మాస్ వైపు చూడలేదు. అయితే ప్రస్తుతం మరోసారి మాస్ కథతో మన ముందుకు వస్తున్నాడు. అశ్వద్ధామ అనే పేరుతో తానే కథ రెడీ చేసుకుని హీరోగా నటించాడు. ఇప్పటికే రిలీజైన అశ్వద్ధామ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. మాస్ లుక్ లో నాగశౌర్య బాగానే చేశాడని అనిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న శౌర్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

 

 

అశ్వద్ధామ కథ రాయడానికి తనకున్న ప్రేరణని తెలిపాడు. తన స్నేహితుడి సోదరికి కలిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా ఈ కథ రాసుకున్నాడట. అలాగే చాలా సాఫ్ట్ గా కనిపించే తనకి కోపం చాలా ఎక్కువని అంటున్నాడు. తాను ఊరికే కోప్పడతాడట. షార్ట్ టెంపర్ కొంచెం ఎక్కువని చెబుతున్నాడు. తాను పనిచేసే దర్శకులు, కెమెరా మెన్ లు, మేకప్ మెన్ ఇలా ఎవరి మీదైనా ఊరికే కోపం వస్తుందని చెప్తున్నాడు.

 

 

అయితే ఆ కోపానికి ఓ సహేతుక కారణం ఉంటుందట. తన కోపం వల్ల అవతలి వాళ్ళకి నష్టం కలగకుండా చూసుకుంటాడట. వర్క్ విషయంలో బెస్ట్ రావడానికే కోప్పడతానని అంటున్నాడు.  కెమెరా మెన్ పై అరిచినా, ఏం చేసినా మంచి అవుట్ ఫుట్ కోసమే... అందుకే అలాంటి అవుట్ ఫుట్ రానపుడు అరుస్తానని.. చెప్తున్నాడు. అల్టిమేట్ గా సినిమా మీదే మా కెరీర్లు డిపెండ్ అయి ఉన్నాయని అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: