2000 ల సంవత్సరంలో విడుదలైన ‘ఆనందం’ సూపర్ సక్సస్ కావడంతో ఆ మూవీలో నటించిన ఆకాష్ మంచి బిజీ హీరోగా మారిపోతాడు అని అప్పట్లో అనుకున్నారు. అయితే ఆ తరువాత ఇతడు నటించిన చాల సినిమాలు వచ్చినా ఆ సినిమాలు అన్నీ వరస ఫెయిల్యూర్ లుగా మారడంతో ఆకాష్ ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ నటుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ సునీల్ లను కార్నర్ చేసిన కామెంట్స్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ తాను రాసుకున్నానని అయితే తాను ఎప్పుడో రాసుకున్న ఆ కథ పూరీ జగన్నాథ్ కు ఒక వ్యక్తి లీక్ చేయడంతో ఆ కథను కొద్దిగా మార్చి ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీగా పూరి మార్చిన విషయాన్ని వివరించాడు.

వాస్తవానికి ఈ సినిమా విడుదల అయ్యే వరకు తనకు పూరి తన కథను వాడుకున్న విషయం తెలియదనీ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత ఆ కథ తనది అని చెప్పినా ఎవరు తన మాట వినరు అన్న ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాను అని ఆకాష్ అంటున్నాడు. ఇండస్ట్రీలో ఉన్నంత రాజకీయాలు రాజకీయ నాయకుల మధ్య కూడ ఉండవని ఇక్కడ రాణించాలి అంటే ఎదుట మనిషిని కాకా పట్టడం బాగా రావాలి అంటూ కామెంట్ చేసాడు.

ఇదే సందర్భంలో కమెడియన్ సునీల్ గురించి మాట్లాడుతూ సునీల్ ‘అందాల రాముడు’ సినిమాను చేస్తున్న సమయంలో ఆ సినిమాలో తాను ఒక అతిథి పాత్ర చేసినా ఆ సినిమా విజయవంతం అయ్యాక జరిగిన సక్సస్ మీట్ లో కనీసం తనను వేదిక పైకి కూడ పిలవక పోవడం తనకు బాధ కలిగించింది అని అంటున్నాడు. ఇండస్ట్రీలో తనకు తెలిసినంత వరకు రాజకీయాలు తెలియని వ్యక్తి ఒక్క రవితేజా మాత్రమే అంటూ ఆకాష్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారడమే కాకుండా ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు ఆకాష్ ఎందుకు బయట పెడుతున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: