ఈ మద్య కన్నడ నాట నుంచి వచ్చిన హీరోయిన్లు మంచి అదృష్టంతో తెలుగు నాట తమ సత్తా చాటుతున్నారు.  కిర్రాక్ పార్టీ తో కన్నడ నాట అడుగు పెట్టిన రష్మక మందన తెలుగు లో నాగశౌర్య నటించిన ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఈ మూవీ మంచి సక్సెస్ కావడంతో అమ్మడికి తెలుగు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీతాగోవిందం’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.  ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో రష్మికకు తెలుగు లో మంచి ఛాన్సులు రావడం మొదలయ్యాయి.

 

ఆ తర్వాత దేవదాస్, డీయర్ కామ్రెడ్ లో నటించింది.  ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావడి పూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ మంచి హిట్ కావడంతో రష్మికకు మరిన్ని ఛాన్స్ లు వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు ఆమె ఇంటికి క్యూ కట్టారు.  ఈ మద్య రష్మిక ఐటీ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఈ అమ్మడి రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు.  కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు లోనే ఎక్కువ అవకాశాలు రావడంతో ఇక్కడి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.  దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ వైపు కూడా దృష్టిసారిస్తోంది రష్మిక మందన్న.

 

‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో తొలుత ఈ భామను కథానాయికగా అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది రష్మిక మందన్న.  కెరీర్‌ తొలినాళ్లలో తెలుగు, తమిళం వచ్చేది కాదు. ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతున్నా. నటన విషయంలో కూడా నేను నిత్యవిద్యార్థినే. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నా’ అని చెప్పింది.  తనకు ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని ఉందని.. అలాంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: